Murder: ప్రజాదీవెన, కందుకూరు: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను (old couple)గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని కొత్తగూడ గ్రామ వ్యవసాయ క్షేత్రంలో నాగర్‌కర్నూల్ జిల్లాకు (Nagarkurnool District)చెందిన ఊశయ్య(56),శాంతమ్మ(50) దంపతులు కొంతకాలంగా పని చేస్తున్నారు. కాగా, బుధవారం గుర్తు తెలియని దుండగుల చేతిలో వీరు హత్యకు (Murder)గురయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.