— గుర్రంపోడు మండలం తేరాటిగూడెంలో ఘటన.
Murder : ప్రజాదీవెన నల్లగొండ : భర్త చేతిలో భార్య దూపల్లి అరుణ (35) దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం గుర్రంపోడు మండలం తేరాటిగూడెం గ్రామంలో జరిగింది. ఈ దారుణ హత్యకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తేరాటి గూడెం గ్రామంలో దూపల్లి కిరణ్, అరుణ దంపతులు నివాసం ఉంటున్నారు. గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న కిరణ్ మద్యానికి బానిసగా మారాడు.
దీంతో దంపతుల మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం మద్యం తాగిన కిరణ్ తో భార్య గొడవ పడింది. దీంతో కిరణ్ ఆగ్రహంతో అరుణను కత్తితో పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి మూడు సంవత్సరాల వయసుగల కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.