MURDER CASE : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నార్సింగి అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్ట వద్ద సంచలనం రేపిన పుప్పా లగూడ జంట హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. అక్రమ సంబంధం కారణంగా దారు ణంగానే హత్య చేసినట్లు పోలీసు లు అనుమానిస్తున్నారు. మృతు లను మధ్యప్రదేశ్‌కు చెందిన అం కిత్ సాకేత్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నార్సింగి లోని అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్టలో జంట హత్య కేసులో అక్రమ సంబంధమే వీరి హత్యకు కారణమైనట్టు పోలీసులు తెలిపారు. అంకిత్ సాకేత్‌కు వివా హిత బిందూతో గత పరిచయం ఏర్పడింది.బిందుకు ముగ్గురు పిల్ల లు ఉన్నట్టు సమాచారం. ఇరువురి మధ్య కొంత కాలంగా అక్రమ సం బంధం కొనసాగుతోంది. ఈ నెల 11న బిందును సాకేత్ ఎల్బీనగర్ నుంచి నానక్ రామ్ గూడకు పిలి పించాడు. బిందును తన స్నేహి తుడి రూమ్‌లో ఉంచాడు.తర్వాత ఇద్దరు కలిసి పుప్పాలగూడ గుట్టల వద్దకు వెళ్లినట్లు పోలీసులు నిర్ధా రించారు.
అనంతరం, అక్కడ వారు ఏకాంతంగా గడిపారు. అయితే, సాకేత్‌కు తెలియకుండా మరో యువకుడితో బిందు ప్రేమాయణం సాగించింది. ఈ నేపథ్యంలో మరో ప్రియుడు వీరిద్దరినీ అక్కడ రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నాడు.ఈ క్రమంలో ఒక్కసారిగా బిందుపై ప్రియుడు దాడి చేసి బండరాళ్లతో మోది హత్య చేశాడు. అయితే ఈ దృశ్యం చూసిన సాకేత్ అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. పారిపోతున్న సాకేత్‌ను పట్టుకుని తన వద్ద ఉన్న కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం ఇద్దరి ముఖాలపై బండ రాయితో దాడి చేసి పరారయ్యా డు.హంతకుడి కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. వీరిని హత్య చేసేందుకు హంతకుడికి మరెవరైనా సహకరించారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరి హత్య కన్నా ముందు అంకిత్ అదృశ్యమైనట్టు గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. వనస్థలిపురంలో బిందుపై మిస్సింగ్ కేసు నమోదైంది. నిన్న నార్సింగిలో ఇద్దరి హత్య జరిగింది.