–వరుస హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనం
–రక్షించాల్సిన పోలీసేతోటి మహిళా కానిస్టేబుల్ ను భక్షంచే దుర్ఘటన
–తన ఎక్స్ ఖాతాలో మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం
MURDER:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి హరీశ్ రావు ద్వజమెత్తారు. తెలంగాణ ( telangana)వరుసగా జరుగుతున్న హత్యలు(murders) , అత్యాచారాలు, హింసాయుత ఘటనలే ఇందుకు నిదర్శనమ న్నారు. గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుం డగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారని, హైదరాబాద్ నడి బొడ్డున బాలాపూర్ లో (balapur) అందరూ చూస్తుండగా సమీర్ అనే యువ కుడిని దారుణంగా పొడిచి చంపా రని, పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నా రిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరచిపోక ముందే, మరో దారుణం చోటుచేసుకున్నదని, రక్షించాల్సిన పోలీసే, తోటి మహిళా కానిస్టేబుల్ ను భక్షంచే దుర్ఘటన నిన్నటి రోజున భూపాలపల్లి జిల్లా లో జరగడం అత్యంత హేయమైన చర్య అని వివరిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు (For law and order)ఈ సంఘటనలే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయని ఆరోపించారు. ఈ సంఘటనలను తీవ్రంగా ఖండి స్తున్నాను. ప్రభుత్వం తక్షణం స్పందించి కారకుడైన ఎస్సై పై చట్టపరమైన చర్యలు తీసుకో వాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. గత పదేళ్ళలో శాంతి భద్రతలకు చిరు నామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్ధకమవటం బాధాకరం. ప్రభుత్వం (government) ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇకమీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలు కాపాడాలని కోరుతున్నామని అన్నారు.