అయ్యో పాపం, కారు ఢీకొని తలకిందులుగా వేలాడిన మహిళ
Murderattempt: ప్రజా దీవెన, కర్ణాటక: కర్ణాటకలోని మంగ ళూరులో తన పక్కింట్లో ఉండే మురళీ ప్రసాద్ అనే వ్యక్తి బైక్ పై వె ళ్తున్న సమయంలో సతీశ్ అనే వ్యక్తి కారుతో గుద్ది హత్యాయత్నం చేశారు. అయితే అదే స మయంలో అటుగా వెళ్తోన్న మహిళను కూడా కారు ఢీకొట్టింది.
కారు స్పీడ్ కు మహిళ ఓ ఇంటి గోడపై పల్టీ కొట్టి వేళాడింది. దీంతో స్థానికులు ఆమెను కిందకు దించారు. ఇటు ఈ ప్రమాదంలో మహి ళతో పాటు మురళికి కూడా గాయాలయ్యాయి. స్థానికుల సమాచా రంతో సతీష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా మురళి తండ్రిపైనా సతీశ్ హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.