*నాలుగు సబ్ స్టేషన్లు ముంపుకు గురయ్యాయి.
*యుద్ధప్రాతిపదికన సరఫరా పునరుద్ధరణ. సిఎండి ముషారఫ్ ఫరూఖ్
Musharraf Farooq: ప్రజా దీవెన, కోదాడ: ఇటీవల కురిసినభారీ వర్షం (rains) కారణం గా రాష్ట్రంలోనే అత్యధికంగా సూర్యాపేట్ జిల్లాలోని విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యింది. ఈ నేపథ్యంలో , బుధవారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ (Musharraf Farooq), కోదాడలో వరద ప్రభావంతో దెబ్బతిన్న రామాపురం, ఎంబీ గూడెం సబ్ స్టేషన్లను, ఇతర విద్యుత్ నెట్వర్క్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈదురు గాలుల ప్రభావంతో చెట్లు, కొమ్మలు విరిగి విద్యుత్ స్తంభాలపై పడటంతో 15 33 కేవీ పోల్స్, 1074 11 కేవీ పోల్స్, 1038 LT పోల్స్ మరియు 319 ట్రాన్స్ ఫార్మర్స్ దెబ్బతిన్నాయాన్నారు. దీనికి తోడు నాలుగు సబ్ స్టేషన్స్ వరద ముంపుకు గురయ్యాయి. ఇంతగా భారీనష్టంజరిగినా,యుద్ధప్రాతిపదికన విద్యుత్సరఫరా పునరుద్ధరించడం కోసం తమ సిబ్బంది, అధికారులు అహర్నిశలు కృషి చేసారని వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ రూరల్ జోన్ పి బిక్షపతి, సూపెరింటెండింగ్ ఇంజినీర్ ఫ్రాంక్లిన్, డివిజనల్ ఇంజినీర్లు (Franklin, Divisional Engineers) మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.