*తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో నేటికీ చెరగని అభిమానం సైదేశ్వర రావు.
Muthineni Saideswara Rao: ప్రజా దీవెన, కోదాడ: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ముత్తినేని సైదేశ్వర రావు (Muthineni Saideswara Rao) అన్నారు.మంగళవారం కోదాడ పట్టణంలోని వారి నివాసంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పట్ల నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) నాయకత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా నేటికీ ప్రజల్లో చెరగని అభిమానం ఉన్నదని నాయకులు గ్రామ, గ్రామాన గడప,గడపకు తరలి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండుగ వాతావరణం లో చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్యదర్శి బయ్యానారాయణ. జిల్లాకార్యదర్శి కొల్లునర్సయ్య. చాపలశ్రీను.పల్లపునాగేశ్వరావు.కొండా సోమయ్య.శోభన్ బాబు .ఉప్పుగండ్ల శ్రీనివాసరావు. కోదాటిగురవయ్య.కొల్లుసత్యనారాయణ.కొత్తానరేష్రెడ్డి.గద్దేవెంకటేశ్వరావు.నెల్లూరివెంకటేశ్వరావు.గింజుపల్లిజగన్. సజ్జారాంమెహన్ రావు.సామర్తపు సాయ్యన్న. రేవంత్ రెడ్డి .సురేష్.హబీబ్.బాబా తదితరులు పాల్గొనారు.