— బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షు డు నాగం వర్షిత్ రెడ్డి
Nagam Varshit Reddy: ప్రజా దీవెన, చౌటుప్పల్: గత అసెంబ్లీ ఎన్నికల (Assembly elections)సందర్భంగా ప్రజలకు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండానే ఇందిరమ్మ కమిటీల పేరుతో మరో మోసానికి తెరలే పిందని బిజెపి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి (Nagam Varshit Reddy)ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమంను చౌటుప్పల్ మున్సి పాలిటీలో బుధవారం స్థానిక నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా బిజెపి (BJP)అధ్యక్షులు వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, ఇచ్చిన హామీలనే అమలు చేయకుండా ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి కొత్తగా ఇందిరమ్మ కమిటీలు గ్రామాలలో వేస్తు న్నారని, భారత దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఉన్నదని, అభివృద్ధి కోసం మోడీ సారథ్యం లోని భారతీయ జనతా పార్టీలో అనేకమంది సభ్యులుగా చేరాలని వర్షిత్ రెడ్డి (Nagam Varshit Reddy) పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి మున్సిపల్ శాఖ మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు, పార్టీ సీనియర్ నాయకులు గుజ్జుల సురేందర్ రెడ్డి, దాసోజు బిక్షమాచారి, ఆలే చిరంజీవి, ముత్యాల భూపాల్ రెడ్డి, ఉబ్బు బిక్షపతి, కడారి ఐలయ్య, కానుగు శేఖర్, కంచర్ల వెంకట్ రెడ్డి, గజం ఆనంద్, ఇటికాల దామోదర్ రెడ్డి, బత్తుల రాజశేఖర్, గోశిక నరహరి, బడుగు ధనుంజయ, బాతరాజు శంకర్ పాల్గొన్నారు.
భవిష్యత్ తరాలకు బిజెపి భరోసా
ప్రజా దీవెన, నారాయణపురం : భవిష్యత్ తరాలకు బిజెపి ధైర్యం అని బిజెపి సభ్యత్వ నమోదు ఉమ్మరంగా చేపట్టాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి (Gangidi Manohar Reddy)పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమ కార్యశాల సమావేశం స్థానిక మండల పార్టీ కార్యాలయంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు సుర్వి రాజుగౌడ్ (Survi Rajugowd) ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొని మాట్లా డుతూ దేశవ్యాప్తంగా జరుగు తున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియపరుస్తూ వరుసగా మూడుసార్లు అధికారం చేపట్టిన నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ప్రతి ఒక్క బూతులో కనీసం 200 మందిని సభ్యులుగా చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు దేవేందర్ యాదవ్, భాస్కర్ నరసింహ గౌడ్, జక్కర్తి బిక్షం, సంపతి సుధాకర్ రెడ్డి, ఉష్కాగుల గిరిబాబు, వెంకటేష్ గౌడ్, కోడూరు బీరప్ప, వేలిజాల శీను, తదితరులు పాల్గొన్నారు.