ప్రజా దీవెన, కేతపల్లి:కేతేపల్లి మండల పరిధిలోని గుడివాడ గ్రామంలో శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షులు డా.నాగం వర్షిత్ రెడ్డి పాల్గొని రామలింగేశ్వర స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి తదానంతరం అర్చకులు ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు .
ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ భక్తి భావంతో మెలిగినప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుందని మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఏదైనా రాణించగలుగుతామని అన్నారు..అదేవిధంగా గ్రామంలోని నూతన బూత్ అధ్యక్షులుగా 273 అధ్యక్షులుగా చెవుల రాజు, 274 బూత్ అధ్యక్షులుగా రాచకొండ శ్రవణ్ , 275 బూత్ అధ్యక్షులుగా కోళ్లు సందీప్ ను నియామక పత్రం అందజేసిన డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి నియమించారు.
నూతనంగా ఎన్నికైన బూత్ అధ్యక్షులకు అభినందనలు తెలియజేస్తూ భూతస్థాయిలో పార్టీ పట్టిష్టకు పాటుపడాలని బూతు స్థాయిలో గడపగడపకు నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలను తెలియజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.