ప్రజా దీవెన, నల్గొండ టౌన్: ఏకసభ్య కమిషన్ చైర్మన్ కి వినతి పత్రం సమర్పించిన బీజేపీ ఎస్సీ వర్గీకరణ వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అమలు పరచాలని.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని.. సుప్రీంకోర్టు తీర్పుల గౌరవించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమండ్ చేస్తున్నాం అని బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు..
Sc వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ గారికి sc ఏబిసిడి వర్గీకరణకు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని మద్దతుకు సంబంధించిన లేఖను సమర్పించడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో మొట్టమొదట తెలంగాణ రాష్ట్రం అమలుపరుస్తుందని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాలయాపన చేస్తున్నట్టు కనిపిస్తోంది..
మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వెలువడి ఇన్ని రోజులు కావస్తున్న కేవలం మాటలకే పరిమితమైన ఈ ప్రభుత్వం వెంటనే sc వర్గీకరణను అమలుపరిచి అన్ని ప్రభుత్వ ప్రవేటు సెక్టార్లలో sc జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం అని ప్రభుత్వం ఏర్పాటు చేసిన sc ఏకసభ్య కమిషన్ చైర్మన్ గారికి మద్దతు లేఖను అందజేయడం జరిగింది.
లేఖ సమర్పించిన వారిలో.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పొతేపాక సాంబయ్య, బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పెరిక మునికుమార్ నాయకులు ఎడ్ల రమేష్,కొత్తపల్లి వెంకట్, జిల్లా కిషోర్, శాంతిస్వరూప్, శ్యామ్, మహేష్,తదితరులు పాల్గొన్నారు..