Nagam Varshit Reddy : ప్రజా దీవెన, నల్గొండ: నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నియామకంపై పునరాలోచన చేయాలంటూ బిజెపి అసంతృప్తి నేతల మీడియా సమావేశం బిజెపి కేంద్ర పార్టీ సూచించిన నియమ నిబంధనలు పాటించకుండా నల్గొండ జిల్లా అధ్యక్షున్ని ఎంపిక చేశారు.
అంటూ మండిపడుతున్న అసంతృప్త నేతలు దీనిపై రాష్ట్ర అధిష్టానం మరోసారి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి లేదంటే మా దారి మేము చూసుకుంటాం అంటూ హెచ్చరిక చేసిన బీజేపీ సీనియర్ నేతలు నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, రాష్ట్ర దళిత మోర్చా కార్యదర్శి సాంబయ్య, నల్లగొండ మున్సిపాలిటీ కౌన్సిలర్స్, మరికొంత మంది బీజేపీ నేతలు