Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nagarjun Sagar project : ఆగస్టు 2న సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల

---హాజరుకానున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తంకు మార్ రెడ్డి --నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు డు కేతావత్ శంకర్ నాయక్

ఆగస్టు 2న సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల

—హాజరుకానున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తంకు మార్ రెడ్డి
–నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు డు కేతావత్ శంకర్ నాయక్

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రైతుల సాగునీటి అవసరాలను దృష్టి లో ఉంచుకొని ఈ నెల 2న నాగార్జు నసాగర్ ( nagarjuna Sa gar) ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువకు నీటిని విడుదల చేయ డం జరుగు తుందని డిసిసి అధ్యక్షు లు కేతావ త్ శంకర్ నాయక్ ( shankar naik) తెలిపారు.

బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాప్ కార్యా లయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్న, చిన్న కారు రైతులందరికీ ( formers) మేలు జరుగుతుం దని అన్నారు. తెలం గాణ ప్రజల ఆకాంక్షల కనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుం దని, అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందని తెలిపారు.

సాగర్ ఎడ మ కాలువ నీటి విడుదల కార్య క్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( minister komatireddy venkatreddy) ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తంకుమార్ రెడ్డి( minister uttam kumar reddy) ఎంపీ రఘువీర్ రెడ్డి, స్థానిక శాసన సభ్యుడు జైవీర్ రెడ్డి ( mla jaiveer reddy) పాటు పలువురు శాసనసభ్యులు హాజరవుతారని తెలిపారు.

ఎడమ కాలువ కు నీటి విడుదల ద్వారా నల్లగొండ, ఖమ్మం ( kha mmam) జిల్లాలో లక్షలాది ఎకరాలు సేద్యం అవు తాయని, రైతు లకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాం లో సాగర్ రిజర్వాయర్ నిండితేనే ఎడమ కాలువకు నీరు విడుదల చేసే వారిని పేర్కొన్నారు.కాంగ్రెస్ ( congress ) ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా సాగర్ రిజర్వాయర్ లోకి వరద నీరు వచ్చిన వెంటనే నీటిని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.

గత ఎన్నికల ముందు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అధికా రంలోకి వచ్చిన వెంటనే హామీలన్నింటినీ అమలు చేస్తుం దని స్పష్టం చేశారు. మొదటి,రెండో విడతల్లో నల్గొండ (nalgonda) జిల్లా లో సుమారు రూ.11 00 కోట్లకు పైగా రైతుల కు రుణమాఫీ జమ అయిందని వెల్ల డిం చారు.

ఈ విలేకరుల సమావేశంలో నల్లగొండ మాజీ జెడ్పి టిసి వంగూరి లక్ష్మయ్య, మాజీ కౌన్సిలర్ మందడి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాదూరి శ్రీనివాస్ రెడ్డి, కత్తుల కోటి, జూలకంటి సైదిరెడ్డి, పిల్లి గిరి, కూసుకుంట్ల రాజిరెడ్డి, యరమాద మోహన్ రెడ్డి, నరేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Nagarjuna Sagar project