–జలాశయాలకు జలకళతో ఆయ కట్టుకు ఆసరా
–ఎగువ నుంచి భారీ వరదతో నిం డుతోన్న ప్రాజెక్టులు
–శ్రీశైలం, నాగర్జునసాగర్ లు నిండ డంతో విడుదలకు నిర్ణయం
–రేపు తెరుచుకోనున్న నాగార్జున సాగర్ గేట్లు
Nagarjuna Sagar Gates: ప్రజా దీవెన హైదరాబాద్: కృష్ణానది పరీవాహక ప్రాజెక్టులన్నీ (All Krishna river basin projects) జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ నిండటంతో వాటి పరిధిలోని ఆయకట్టుకు ఊపిరి పోసినట్లయింది. ప్రాజెక్టులు ఎట్టకే లకు పూర్తి స్థాయిలో నిండడంతో సాగు నీటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజులుగా ఎగువ నుంచి కృష్ణమ్మకు భారీగా వరద వస్తుండటంతో జలాశయా లన్నీ నిండు కుండలా మారాయి. దీంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో (Kharif season) కృష్ణా ప్రాజెక్టుల కింద 14.05 లక్షల ఎకరాలకు 125 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు సర్కారు సన్న ద్ధమవుతోంది. రాష్ట్ర స్థాయి సాగునీ టి విడుదల ప్రణాళిక కమిటీ చైర్మన్ ఈఎన్‌సీ (జనరల్) అనిల్ కుమార్ నేతృత్వంలో శనివారం జరిగిన స మావేశంలో ఈ నిర్ణయం తీసుకు న్నారు.
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) నుంచి నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) దాకా ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండటంతో ఈ జలాశయాల కింద పంటలకు నీటిని ఇవ్వడానికి ఇబ్బం దుల్లేవని గుర్తించారు. ఇక, గోదావరి బేసిన్‌లో పలు ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవు. దీం తో 15 రోజుల్లో మళ్లీ సమావేశమై నీటి విడుదలపై నిర్ణయం తీసుకో వాలని నీటి పారుదల శాఖ (Irrigation Department)యోచి స్తోంది. గోదావరి బేసిన్ ప్రాజెక్టుల కింద 17.95 లక్షల ఎకరాలకు 188 టీఎంసీల నీటిని సాగు అవసరాల కు అనుగుణంగా అందించేందుకు నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఈ సీజన్‌లో కృష్ణా, గోదావరి పరిధి లోని ప్రాజెక్టుల నుంచి 32 లక్షల ఎకరాల్లో పంటల సాగు కోసం 313 టీఎంసీల నీటిని అందించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
శ్రీశైలం యధావిధి వరద (Srisailam Yadhavidhi Flood) ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ జలాశయం శరవేగంగా నిండుతోం ది. సోమవారం సాయంత్రాని కల్లా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాగర్ నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా శనివారం సాయంత్రం 6 గంటల కల్లా 244.15 టీఎంసీల నీరు ఉంది. మరో 67.85 టీఎంసీలు వచ్చి చేరితే ప్రాజెక్టు పూ ర్తిగా నిండనుంది. సోమవారం సాయంత్రం కల్లా ప్రాజెక్టు గేట్లను ఎత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తూప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో (Hydropower station)కరెంటు ఉత్పత్తి ప్రారం భించారు.
దాంతో ఈ వరదంతా పులిచింతల ప్రాజెక్టుకు వచ్చిచేరు తోంది. పులిచింతల సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.69 టీఎంసీల నీరు ఉంది. బుధ వారం కల్లా ఈ ప్రాజెక్టు నిండే అవ కాశాలున్నాయి. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర (Almaty, Narayanpur, Jurala, Tungabhadra) జలాశయాలకు వరద నిలకడగా కొనసాగుతోంది. గోదా వరి బేసిన్‌లో ప్రధానంగా సాగు నీ రు అందించే ప్రాజెక్టులకు వరద నిరాశాజనకంగానే ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 25 వేల క్యూసె క్కులు, కడెంకు 1,518 క్యూసెక్కు లు, ఎల్లంపల్లికి 8,355 క్యూసెక్కు లు, సింగూరు ప్రాజెక్టుకు 565 క్యూసెక్కుల నీరు వస్తోంది. భూపా లపల్లి జిల్లా మహదేవపూర్ మండ లంలోని మేడిగడ్డ బ్యారేజీకి 3.62 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుం డగా 85 గేట్లను ఎత్తి అంతే నీటిని వదులుతున్నారు.