Nagarjuna Sagar ministers : ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత
--ఆరున్నరలక్షల ఎకరాల కొత్త ఆ యకట్టు ధ్యేయం --ప్రతి ఏడాది ప్రజా ప్రభుత్వo ప్రధాన లక్ష్యం --నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వ నీటిని విడుదల సందర్భంగా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి లు
ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత
–ఆరున్నరలక్షల ఎకరాల కొత్త ఆ యకట్టు ధ్యేయం
–ప్రతి ఏడాది ప్రజా ప్రభుత్వo ప్రధాన లక్ష్యం
–నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వ నీటిని విడుదల సందర్భంగా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి లు
ప్రజా దీవెన, నాగార్జున సాగర్: రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు లకు ( irrigation projects) అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి సంవ త్సరం 6 నుండి ఆరున్నర లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కల్పించా లని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పమని రాష్ట్ర నీటి పారుదల,పౌర సర ఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( utta mkumar reddy) అన్నారు.
రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తో కలిసి శుక్రవారం అయన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ( Nagarjuna Sagar) ప్రాజెక్టు ఎడ మ కాలువకు సాగు నీటిని విడుదల చేశారు. అక్కడే కృష్ణ జలాలకు సారె సమర్పించా రు. లో లెవల్ కెనాల్ దగ్గర పూజలు నిర్వ హించిన అనంతరం నాగా ర్జునసాగర్ విజయ విహార్ ( Vijay vihaar) వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం లో 30 నుండి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అం దించాలన్నదే లక్ష్యమని ( targe t) తెలిపారు. దశాబ్ద కాలంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఇంత త్వ రగా సాగు నీటిని విడుదల చేసింది తామేనన్నారు. పూర్తి సామ ర్థ్యంతో నీటిని వదిలి పెట్టడం జరిగిందని, దారి పోడవున సాగు నీటికి, అదే విధంగా తాగు నీటికీ చెరువులు నింపుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.
గత ప్రభుత్వ అనాలోచిత విధానం వల్ల పది సంవత్సరాలుగా నీటి పారుదల శాఖ (irrigation) అస్తవ్యస్తంగా మా రిందని అన్నారు. లక్ష 80 వేల కోట్లు ఖర్చు చేసి నామమాత్ర ఆయకట్టుకు సాగునీ రిచ్చారని, కాళేశ్వరం ( kaleswaram),పాలమూరు- రం గారెడ్డి ద్వారా సైతం సాగునీరు ఇవ్వలేదని చెప్పారు. మెడిగడ్డ ( medi gadda) డ్యామ్ బ్యారేజ్ నాసిరకం పనులతో, నాణ్యతతో, నిర్వహణ సైతం లోపభూయిష్టంగా ఉందని చెప్పారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటి ని పూర్తి చేస్తా మని, ముఖ్యంగా ఎస్ ఎల్బీసీ, డిండి, బ్రాహ్మణ వెళ్లెముల, పిల్లా యిపల్లి వంటి ప్రాజెక్టుల న్నింటిని పూర్తి చేస్తామని ఆయన తెలిపా రు. నల్గొండ, మిర్యాలగూడ తదితర అన్ని నియోజకవర్గాలలో కొత్త ప్రాజెక్టులతోపాటు పాత ప్రాజెక్టులను (old projects) చేస్తామని ఆయన చెప్పారు.
ఎస్ఎల్బి సి ( slbc), బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టులకు అత్యంత ప్రా ధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసు కుంటున్నామని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ ( state budget) ఇరిగే షన్ కు 22,5 00 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింద ని, ఇందులో 10,828 కోట్లు ఆగిపోయిన ప్రాజెక్టుల పనులకు, 11 వేల కోట్లు ఎస్టాబ్లిష్మెంట్ ( establishment) కింద తీసుకోవడం జరి గిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపది కన (On a war footing) పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నదని అన్నారు. నాగార్జున సాగ ర్ ఎడమ కాలువ ద్వారా 11,000 క్యూ సెక్కుల నీటిని విడుదల చే యడం జరిగిందని మంత్రి తెలిపా రు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( komatireddy Venkatreddy) మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాగార్జునసాగర్ ప్రాజె క్టు ద్వారా పూర్తిస్థాయిలో నీరు ఇస్తున్నామని తెలిపారు.
ప్రణాళికా బద్దంగా అన్ని చెరువులను నీటితో నింపుకోవడం జరుగు తుందని చెప్పారు. ప్రపంచం లోనే పొడవైన ఎస్ఎల్ బి సీ ( slbc ) పూర్తి కి తమ ప్రభు త్వం నిధులు విడుద ల చేయడం జరిగిందని, ఎస్ఎల్బీ సీ పూర్తి అయితే నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు, తాగునీ రు అందుతుందని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తి చేసే పనీ లో ఉన్నామని, ఇవన్నీ పూర్తయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ( united nalgonda district) సస్యశ్యా మలమ వుతుందని తెలిపారు. మూ డేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేం దుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.
శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న ,శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్, మాజీ మంత్రి జానారెడ్డి తదితరు లు మాట్లాడారు.రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి,సి ఈ నాగేశ్వరరావు , ఎస్ ఈ,ఈ ఈలు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు,ప్రజా ప్రతినిధులు ఈ మీడి యా సమావేశంలో పాల్గొ న్నారు.
అంతకుముందు హెలి ప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ సి.నారా యణ రెడ్డి,ఎస్ పి శరత్ చంద్ర పవార్,ఇరిగేషన్ సి ఈ నాగేశ్వర్ రావు, ఇంజనీరింగ్ అధికారులతో పాటు,పలువురు ప్రజా ప్రతినిదులు మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
Nagarjuna Sagar ministers