నాగార్జునసాగర్ 20 గేట్ల ఎత్తివేత
ప్రజా దీవెన, నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ( Nagarjuna Sagar) వరద కొనసా గుతుంది. ప్రస్తుతానికి ప్రాజెక్టు సంబంధించి 20 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో 16 గేట్లను 10 ఫీట్ల పైకి, నాలుగు గేట్లను ఐదు ఫీట్ల పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 (steps) అడుగులు కాగా ప్రస్తుతం 585.10 అడుగుల వద్ద కొనసాగు తుంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 312 టిఎంసిలు ( tmc) గా ప్రస్తు తం 298 టిఎంసిల గా ఉంది. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కు ఇన్ఫ్లో (inflow) 3 లక్షల క్యూ సెక్కులు కాగా అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు.
Nagarjuna Sagar project