*రైతు రుణమాఫీ, రైతు భరోసా నిధులు తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలి.బొల్లు.ప్రసాద్.
Nagarjunasagar:ప్రజా దీవెన, కోదాడ:నాగార్జునసాగర్ (Nagarjunasagar)ఎడమ కాలువ ద్వారా రైతులకు ప్రభుత్వం సాగునీటి ని విడుదల చేయాలని రైతు సంఘం (Farmers Association) సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు. ప్రసాద్,సిపిఐ మండల కార్యదర్శి బత్తినేని. హనుమంతరావు లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం కోదాడ పరిధిలోని తమ్మరలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో తక్షణమే రైతులకు సాగునీటిని విడుదల చేస్తే నారుమల్లు పోసుకొని పంటలు పండించేందుకు వీలుంటుంది అన్నారు. అదేవిధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని.
రైతు భరోసా నిధుల (Farmers’ Assurance Funds) కోసం గ్రామంలో రైతులందరూ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులను విడుదల చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి బత్తినేని. హనుమంతరావు సిపిఐతమ్మర కార్యదర్శి మాతంగి. ప్రసాద్ రైతులు,బత్తినేని. శ్రీను, కమతం. కుటుంబరావు,మాతంగి. రమేష్, కొండ. కోటేశ్వరరావు, అల్వాల.గురవయ్య, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.