Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nageswara Rao : జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి: నాగేశ్వరరావు

Nageswara Rao : ప్రజా దీవెన, కోదాడ: రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (టియు డబ్ల్యూజే,ఐజేయు ) *జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు, ప్రెస్ క్లబ్ జిల్లాఅధ్యకలు గింజల అప్పిరెడ్డి కోరారు. సోమవారం కోదాడ పట్టణంలో టియుడబ్ల్యూజె యూనియన్ డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన జర్నలిస్టుల అందరికీ ఇండ్లు స్థలాలు మంజూరు చేయాలన్నారు. జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు లో అవకాశం కల్పించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలును వర్తింపజేయాలని కోరారు.

 

ప్రభుత్వం హెల్త్ కార్డులు సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. కార్పొరేట్ వైద్యశాలలో హెల్త్ కార్డులకు సరైన వైద్య సదుపాయం కల్పించడంలో అధికారులు విఫలమైనారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు రాయపూడి చిన్ని, టి యు డబ్ల్యూ జే యూనియన్ దాడుల నిరోధక కమిటీ జిల్లా అధ్యక్షులు బాదే రాము, జిల్లా ఉపాధ్యక్షులు ఆవుల మల్లికార్జున రావు, కోట రాంబాబు, సతీష్ కుమార్, అలుగుబెల్లి హరినాథ్, పాల్గొన్నారు.