Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nakirekal MLA Vemula Veeresham : మత సామరస్యానికి ప్రతీక పవిత్ర రంజాన్

–నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరే శం

Nakirekal MLA Vemula Veeresham : ప్రజా దీవెన, నకిరేకల్: రంజాన్‌ మాసం ఎంతో పవిత్రమైనదని, ముస్లింలు ఎంతో నిష్టతో నెలంతా దీక్షలు చేస్తారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవా రం నకిరేకల్ పట్టణంలోని శకుంత ల పంక్షన్ హల్ లో కేతేపల్లి, నకిరేక ల్, కట్టంగూర్ మైనార్టీ సోదరులకు నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో పా ల్గొన్నారు. అనంతరం వారు మా ట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం లో జరిగే ఇఫ్తార్ విందులు ప్రజల మధ్య సోదరభావం, ఆత్మీయ సహృద్భావాలను పరిమళింప జేస్తాయని పేర్కొన్నారు.

 

 

పవిత్రమై న రంజాన్ మాసంలో విశ్వశాంతికి ఆ అల్లాహ్ ను ప్రార్తించడం జరుగు తుందని, కులమతాలకు అతీతం గా నకిరేకల్ మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. పవిత్ర దైవా రాధనకు, ధార్మిక చింతనకు, దైవభ క్తికి క్రమశిక్షణకు, దాతృత్వానికి రంజాన్ మాసం ఆలవాలం అన్నారు.

మనిషి సత్ప్రవర్తనలో నడవడానికి రంజాన్ ఉపవాసాలు ఉపకరిస్తా యన్నారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరా ధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ఉపవాసాల ముఖ్య ఉద్దే శం అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ దైవం అనుసరించిన మార్గంలో నడవా లన్నారు.