ప్రజా దీవెన, నల్గొండ టౌన్:
Union Minister Jayant Chaudhary: నల్గొండ జిల్లాలోని యువతకు మంచి భవిష్యత్ కల్పించాలనే ఉద్దేశ్యంతో హైద్రాబాద్ కు విచ్చేసిన కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి జయంత్ సింగ్ చౌదరిని కలిసి యువతకు పెద్దఎత్తున అవకాశాలు కల్పించాలని కేంద్రమంత్రికి విన్నపం చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి.
ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో మంచి స్కిల్స్ వున్న యువత అనేకమంది ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఎలాంటి ఉపాధి మార్గాలు చూపట్టకపోవడంతో అభివృద్ధి పదంలో రాణించలేకపోతున్నారూ అని ఆవేదన వ్యక్తం చేశారు.
యువతకు అందుబాటులో ఉన్న నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై కేంద్ర మంత్రితో వినూత్నంగా చర్చించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ పథకం ద్వారా ఉపాధి మార్గాలు చూపెట్టాలని కోరానని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి అరులైన వారికి అన్ని విధాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దోహదపడుతుంది తెలిపినట్టు నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు.