Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda citu : నల్లగొండ మాస్టర్ ప్లాన్ ఆమోదoతో అభివృద్ధికి నిధులు

నల్గొండ మాస్టర్ ప్లాన్ ఆమోదoతో అభివృద్ధికి నిధులు

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ మాస్టర్ ప్లాన్ గత 38 సంవ త్సరాల క్రితం రూపొందిం చిందని దానిని మార్పులు చేస్తూ నలగొండ నూతన మాస్టర్ ప్లాన్ ఆమోదించి అభివృద్ధికి నిధులు పెంచే విధం గా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాల ని సిపిఎం జిల్లా కమిటీ స భ్యు లు ఎండి సలీం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య కోరారు.

శుక్రవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్ లో జరిగిన విలేక రుల సమావేశంలో వారు మాట్లా డుతూ 1987లో జీవో నెంబర్ 594 ద్వారా ఆమోదించిన మాస్టర్ ప్లాన్ ద్వారానే నేటి కి నల్లగొండకు అభివృద్ధి నిధులు కేటాయింపబడుతున్నాయని అ న్నారు.

2014లో మాస్టర్ ప్లాన్ లో రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, పబ్లిక్, సెమీ పబ్లిక్, సెమి రెసిడెన్షియల్ సెమీ కమర్షియల్ జోన్, అర్బన్ బేసిడ్ ( పట్టణ శివారు ప్రాంతాల) జోన్ లాగా విభజించి నలగొండ మాస్టర్ ప్లాన్ బ్లూప్రింట్ విడుదల చేశారని గుర్తు చేశారు వాటిపై అనేక అభ్యంతరాలు ప్రజలు దరఖాస్తు రూపం లో ఇచ్చారని వాటిని సమీక్షించి మార్పులు చేస్తూ పూర్తిస్థాయి మాస్ట ర్ ప్లాన్ ప్రవేశపెట్టాల్సిన నలగొండ మున్సిపల్ పాలకవర్గం 10 సంవ త్సరాలుగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు విఫలమయ్యాయని అన్నా రు.

ఈ నెల 28న నలగొండ పట్టణానికి ముఖ్యమంత్రి రాక సందర్భంగా వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని అభ్యంతరాలను సమీక్షించి మాస్టర్ ప్లాన్ ఆమోదింపజేసి అందుకు అనుగుణంగా నిధులు పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మాస్టర్ ప్లాన్ ఉండడం ద్వారా 33 ఫీట్ల రోడ్లు, 150 ఫీట్ల రోడ్లు ఉంటాయని, కొత్త గా వస్తున్న వెంచర్లలో 10 శాతం భూమిని మున్సిపాలిటీకి రిజి స్ట్రేషన్ చేస్తూ వినోదం ఇతర అవసరాలకు పార్కుల అభివృద్ధి, అమృత స్కీం ద్వారా మంచినీటి పైప్ లైన్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణానికి కేంద్రం నుండి వస్తున్న నిధులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని గుర్తు చేశారు.

ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ లో కొన్ని మార్పులు చేస్తూ భవిష్యత్తు ఇరవై సంవత్సరాలకు ఉపయోగపడే విధంగా రూపొందించాల్సిన మాస్టర్ ప్లాన్ నేటికి 40 సంవత్సరాలు అయినా నల్గొండ పట్టణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించకపోవడం దురదృష్టక రమని అన్నారు.. గత మాస్టర్ ప్లాన్ లో ఉన్న ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లలో ప్రస్తుతం అనేకమంది ఇండ్లు నిర్మించుకొని రెసిడెన్షియల్ ప్రాంతంగా మారిపోయిందని అన్నారు.

ఇల్లు నిర్మించుకునే వారు పర్మిషన్ కోసం మున్సిపాలిటీ దరఖాస్తు పెట్టుకోగా అనుమతి ఇవ్వకపోయినా ఇండ్లు నిర్మించుకున్నారని దాని ద్వారా మున్సిపాలిటీ ద్వారా పర్మిషన్ మరియు ఇంటి టాక్స్ ఆదాయం కోల్పోతుందని, మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న స్కీములు అమృత్యులాంటి ఇతర అనేక స్కీములు మాస్టర్ లేకుంటే వెనక్కి పోయే ప్రమాదం ఉందని అన్నారు.

కాబట్టి వెంటనే స్థానిక ఎమ్మెల్యే రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ పట్టణ అభివృద్ధికి కావలసిన ప్రధానమైన నల్గొండ మాస్టర్ ప్లాన్ ఆమోదానికి ఉన్న ఆటంకాలను సమీక్షించి వెంటనే ఆమోదింప చేయడానికి కావలసిన తగు చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్ ,పట్టణ కమిటీ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, దండెంపల్లి సరోజ, గాదె నర సింహ, భూతం అరుణ, మారగోని నగేష్, గుండాల నరేష్, సలివోజు సైదాచారి, కోట్ల అశోక్ రెడ్డి, గంజి నాగరాజు తదితరులు పాల్గొన్నా రు.

Nalgonda citu