Collector Ila Tripathi : ప్రజా దీవెన, శాలిగౌరారం: ప్రాథమి క వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా సా ధారణ ప్రసవాలను పెంచాలని నల్ల గొండ జి ల్లా కలెక్టర్ జిల్లా త్రిపాఠి అ న్నారు. గురువారం ఆమె శాలిగౌరా రం మండల కేంద్రంలో వివిధ ప్రభు త్వ సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేం ద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తని ఖీ చేసి వైద్యులు, సిబ్బందితో మా ట్లాడారు.
ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వా రా అందిస్తున్న సేవల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్ సి లలో ప్రసవాల సంఖ్య పెంచాలని, ముఖ్యంగా సాధారణ ప్రసవాలు ని ర్వహించాలని, వర్షాలు వస్తున్నం దున సీజనల్ వ్యాధుల పట్ల అప్ర మత్తంగా ఉండాలని చెప్పారు. ఇం దిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా 70% లోపు గ్రౌండింగ్ ఉన్న చోట వే గవంతం చేసి 3 రోజుల్లో పురోగతి తీసుకువచ్చేలా చూడాలని ఆదేశిం చారు.
మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దు కాణాన్ని తనిఖీ చేసి గోదాంలో ఉ న్న స్టాకును, విక్రయాలను రిజిస్టర్ల ను, బిల్లులు, రసీదులు పరిశీలించా రు.అనంతరం ఎంపీడీవో కార్యాల యంలో ఇందిరమ్మ ఇండ్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, వనమహో త్సవం తదితర అంశాలపై సమీక్షిం చారు.ఆ తర్వాత కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థుల విద్యా సామర్ధ్యాలను పరిశీలించారు.
తరగతి గదులు, టాయిలెట్ల మర మ్మతుకు అంచనాలను పంపించా లని ఆదేశించారు. అదేవిధంగా ఎం పీడీవో కార్యాలయంలో విద్యుత్ మరమ్మతులకు గాను అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలి పారు.నల్గొండ ఆర్డిఓ వై అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కు మార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, స్థానిక అధికారులు, తదిత రులు ఉన్నారు.