Nalgonda Collector Tripathi : ప్రజాదీవెన , నల్గొండ : పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని తనిఖీచేశారు.
జిల్లా విద్యాశాఖ అధికారి, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటిండెంట్లతో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి కేటాయించిన విద్యార్థులు, హాజరైన విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ గుర్రంపోడు మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు.