Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda Collector Tripathi : ఐటిఐ కళాశాల నిర్మాణం కోసం స్థల పరిశీలన

— పూర్తి వివరాలను సమర్పించాలని ఆర్డిఓను ఆదేశించిన కలెక్టర్

Nalgonda Collector Tripathi : ప్రజాదీవెన , నల్గొండ : చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట వద్ద ఐటిఐ కళాశాల నిర్మాణం కోసం గుర్తించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం తనిఖీ చేశారు.

361 సర్వే నెంబర్ లో సుమారు 2 ఎకరాల స్థలంలో ప్రతిపాదిత ఐటిఐ కళాశాలను నిర్మించే నిమిత్తం ప్రభుత్వం స్థలాన్ని గుర్తించాలని ఆదేశించిన మీదట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చండూర్ ఆర్డీవో, తహసిల్దారులు 361 సర్వే నంబర్లో స్థలాన్ని గుర్తించగా, ఆ స్థలాన్ని పరిశీలించి ఐటిఐ కళాశాల ఏర్పాటుకు అనువైన పరిస్థితులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె ఆర్డిఓ తో మాట్లాడుతూ ఐటిఐ కళాశాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. చండూర్ ఆర్డీవో శ్రీదేవి, తహసిల్దార్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.