Nalgonda court : ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జిల్లా అదనపు సెషన్ , ఎస్సి ఎస్టీ కోర్టు మరో సంచలన తీర్పు వెలు వరించింది. నల్లబోతు జగన్ అనే కామాంధుడికి 27 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి రోజా రమ ణి తీర్పు చెప్పింది. గుర్రంపోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతి ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కనగల్ మండలo పర్వతగిరి కి చెం దిన నల్లబోతు జగన్ గర్భవతిని చేశాడు.
పోలీసులు సాక్షాదారాలు బలంగా నిరూపించడంతో అత్యా చారం చేసినందుకు గాను పదేళ్ల జైలు శిక్ష,రూ వెయ్యి జరిమానాతో పాటు దళిత యువతిని మోసగిం చినందుకు గాను మరో పదేళ్ల జైలు శిక్ష,రూ వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశా రు. అదే విధంగా యువతిని పెళ్లి చేసుకుంటానని మోసగించినం దు కు గాను మరో ఏడేళ్లు,వెయ్యి జరి మానా విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పు వెలువరించారు.