— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజా దీవెన, మిర్యాలగూడ: నల్ల గొండ జిల్లాను టిబి(క్షయ) రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సవాల్ గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి పిలుపునిచ్చారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువా రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ రై స్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం లో “టీబి ముక్త్ భారత్ అభియాన్” పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావే శానికి ఆమె హాజరయ్యారు.
సాంకేతికత అంతగా అభివృద్ధి చెం దని రోజుల్లోనే మన దేశంలో క మ్యూనిటీ సహకారంతో అంటు వ్యాధులను సమర్థవంతంగా ఎదు ర్కొని పారద్రోలిన ఘనత వైద్య ఆ రోగ్యశాఖకు ఉందని ,దీన్ని దృష్టిలో ఉంచుకొని టీబి ని సైతం జిల్లా నుం డి పూర్తిగా నిర్మూలించేందుకు ఒక సవాల్ గా స్వీకరించాలని అన్నారు. ఇందుకు వైద్య ఆరోగ్యశాఖతో పా టు సంబంధిత శాఖలు కృషి చేయా లని చెప్పారు.
ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది, ఏఎ న్ఎం, ఆశా కార్యకర్తలు విధులను సాధారణ పద్ధతిలో నిర్వర్తించకుం డా, గుర్తింపు వచ్చేలా పనిచేయాల న్నారు. అక్టోబర్ 2 నాటికి క్షయ ర హిత నల్గొండగా దిద్దేందుకు కృషి చే యాలన్నారు. ఇందులో భాగంగా ఆ శా ఏఎన్ఎంలు గ్రామాలకు వెళ్లి ప్ర జలకు టి బి పట్ల అవగాహన కల్పిం చాలన్నారు. రెండు వారాలకు మిం చి దగ్గు ఉండే వారిని గుర్తించి చైత న్యం చేసి పరీక్షలు చేయించుకునే లా చూడాలన్నారు.
మిర్యాలగూడ ప్రాంతంలో రైస్ మి ల్లులు ఎక్కువగా ఉండడం దు మ్ము ,ధూళి ఎక్కువగా ఉన్నందున, ఈ ప్రాంతంలో టిబి వచ్చేందుకు ఆ స్కారాలు ఎక్కువగా ఉన్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడి
ప్రజలకు, ప్రత్యేకించి రైస్ మిల్లులో పనిచేసే వారు, డ్రైవర్లు, హమాలీ లు, ఇతరులు అందరికి పరీక్షలు ని ర్వహించేందుకు ఒక షెడ్యూల్ రూ పొందించాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ను ఆదేశించారు.వివ రాల ను ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చే యాలనిచెప్పారు. అలాగే ఆశ కా ర్యకర్తలు ప్రతి గ్రామ పంచాయతీని సందర్శించి టీబి పై అవగాహన క ల్పించాలన్నారు .బాగా పనిచేసిన ఆశ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను స న్మానించడం జరుగుతుందని ఆమె తెలిపారు.
నల్గొండ, మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం తరఫున సుమారు 20 లక్ష ల రూపాయల విలువచేసే ఆర్టి ఫి షియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్ రే మిష న్ ను వైద్య ఆరోగ్య శాఖకు ఇస్తు న్నందుకు ఆమె రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులను అభినందించారు .
జిల్లా టీబి నియంత్రణ అధికారి డా క్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ టీబి ముక్త్ భారత్ అభియాన్ కింద చేపట్టిన కార్యక్రమాలను వివరించా రు. జిల్లాలో క్షయ వ్యాధి నివారణ కు సర్వేను ముమ్మరం చేయడం , గుర్తించిన రోగులకు వైద్య పరీక్షల తో పాటు, క్రమం తప్పకుండా చికి త్స అందించడం, జిల్లా నుండి పూ ర్తిగా టీబిని నివారించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా చర్యలు తీసు కోవడం జరుగుతున్నదని తెలిపా రు . 2024 లో జిల్లాలో 2426 టీబి కేసులు గుర్తించగా, ఇందులో 66 మంది చనిపోయారని, ఈ సంవ త్సరం ఇప్పటివరకు 1296 మంది ని గుర్తిస్తే పదిమంది చనిపోయార ని ,తక్కిన వారికి చికిత్స అందిస్తు న్నామని చెప్పారు. రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో టీబి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా మిర్యాలగూడలో అవగా హన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు.
టీబి రహిత గ్రామపంచాయతీలలో భాగంగా 2023లో జిల్లాలో 36 గ్రా మ పంచాయతీలలో, 2024 లో 96 గ్రామ పంచాయతీలలో ఒక్క టీ బి కేసు కూడా నమోదు కాలేదని, 2025 డిసెంబర్ నాటికి టీబి లేని జిల్లాగా అన్ని గ్రామ పంచాయతీ లను తీర్చిదిద్దాలని తెలిపారు .
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా ఆసుప త్రుల సమన్వయ అధికారి డాక్టర్ మాతృ నాయక్ ,రైస్ మిల్లర్ల సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ రైస్ మిల్లుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, తది తరులు మాట్లాడారు. మిర్యాలగూ డ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇం చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ ,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్వో లు వేణుగోపాల్ రెడ్డి ,రవి ,పౌర సర ఫరాల జిల్లా మేనేజర్ హరీష్ , డిఎ స్ఓ వెంకటేశ్వర్లు, మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం కార్యదర్శి బా బి , ప్రతినిధులు భద్రం, వైద్యా ధికారులు తదితరులు ఈ సమా వేశానికి హాజరయ్యారు.