Nalgonda district collector : ధాన్యాన్ని వెంటవెంటనే తరలించాలి
--నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి త్రిపాఠి
ధాన్యాన్ని వెంటవెంటనే తరలించాలి
—నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి త్రిపాఠి
ప్రజా దీవెన, నల్లగొండ: సరైన తేమశాతంతో రైతులు ధాన్యాన్ని కొను గోలు కేంద్రాలకు తీసుకువచ్చినట్లయితే వెంటనే కొనుగోలు చేసి ధా న్యాన్ని కొనుగోలు కేంద్రాల నుండి తరలించాలని జిల్లా కలెక్టర్ఇలా త్రిపాఠి ( collector ila tripathi) లారీలు ,హమాలీలు, ఇతర సమస్యల కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నా రు. మద్దతు ధర పొందేందుకు, అలాగే తేమ కారణంగా కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండకుండా ఉండేందుకుగాను, ధాన్యాన్ని ఆర బెట్టి కొనుగోలు కేంద్రాలకు ( To purchase centers) తీసుకు రావాలని ఆమె రైతులతో కోరారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. ముందుగా ఆమె కట్టంగూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం ( pacs ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని పరిశీలించారు.శాలిగౌరారం మండల కేంద్రంలోని వ్యవ సాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని, నకిరేకల్ మండలం చెన్నాళగడ్డ, నల్గొండ (nalgonda) సమీపంలోని ఆర్జ లబావి వద్ద ఏ ర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు.
కట్టంగూరు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద లారీల సమస్య ఉందని నిర్వాహకులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, తక్షణమే అవసర మైన లారీలను ఏర్పాటు చేయాలని జిల్లా మార్కెటింగ్ శాఖ ( mar keting department) అధికారిని ఆమె ఆదేశించారు. 17% లోపుగా తేమతో ధాన్యాన్ని రైతులు తీసుకువచ్చినట్లయితే కొనుగో లు కేంద్రాలలో ఎట్టి పరిస్థితులలో ఉం చకుండా తక్షణమే కొనుగోలు చేసి పంపించాలని నిర్వాహకులను ఆదేశించారు.
శాలిగౌరారం మార్కెట్ యార్డ్ లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో పండగ కారణంగా హమాలీలు లేరని తెలుసుకొని జిల్లా స్థాయి నుండి ఆదేశాలు లేకుండా కొనుగోలు కేంద్రం స్థాయిలో నిర్ణ యాలు తీసుకోవద్దని, తక్షణమే హమాలీలను ఏర్పాటు చేసి ధాన్యా న్ని తరలించాలని ఆదేశించారు.
నకిరేకల్ మండలం చెన్నాళగడ్డ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎక్కువ తేమతో ధాన్యాన్ని రైతులు తీసుకురాగా, దానిని గమనించిన జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రా లకు తీసుకురావాలని, ఈ విషయంలో కొనుగోలు కేంద్రం నిర్వాహ కులతో పాటు, వ్యవసాయ శాఖ ( agriculture departme nt) అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని, రాష్ట్ర ప్రభు త్వం ధాన్యానికి ప్రకటించిన మద్దతు ధర వచ్చేందుకు రైతులు ధా న్యాన్ని ఆరబెట్టి తీసు కురావడంతో పాటు, శుభ్రంగా ఉండేలా తీసు కురావాలని, కొనుగోలు కేంద్రం వద్ద వచ్చి ధాన్యాన్ని ఆర బెట్టు కోకుం డా వారి పంట పొలాల వద్ద, లేదా ఇళ్ల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకొచ్చే విధంగా అవ గాహన కల్పించాలన్నారు.
ఆర్జాల బావి ధాన్యం కొనుగోలు కేంద్రంలో పండగ ,హమాలీల సమ స్య తదితర కారణాలతో ధాన్యం కొనుగోలు నెమ్మదిగా సాగుతూ ఉం డడం గమనించిన జిల్లా కలెక్టర్ ఆర్జాలబావి కొనుగోలు కేంద్రంలో 16 వేల క్వింటాళ్ల ధాన్యం ఉందని తెలుసుకొని రోజుకు 4000 క్వింటాళ్ల చొప్పున ధాన్యాన్ని కొని తరలించే విధంగా స్థానిక ఆర్డిఓ అక్కడే ఉం డి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సరైన తేమశాతంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు వస్తే కొనుగోలు కేంద్రాల (purchage Centers) వద్ద వారు వేచి ఉండాల్సిన అవ సరం లేదని, అలాగే ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల లో ఉంచవద్దని వెంటనే పంపించాలని నిర్వాహకులతో చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, అవసరమైన సౌకర్యాలతో పాటు లారీల ను, హమాలీ లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
రైతులు ధాన్యం అమ్మే విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయా కేంద్రాల వారిగా తగు ఆదేశాలను జారీ చేస్తామని చెప్పారు. ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9963407064 నంబర్ కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని ఆమె స్పష్టం చేశారు.జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సహకార శాఖ అధికారి పత్యా నాయక్ ,తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.