— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nalgonda District Collector Tripathi : ప్రజా దీవెన , మునుగోడు: భూ స మస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా తీ సుకొచ్చిన చట్టమే భూ భారతి చట్టమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.భూ భారతి చట్టంపై నిర్వ హిస్తున్న అవ గాహన సదస్సులలో భాగంగా గు రువారం ఆమె నల్గొండ జిల్లా ము నుగోడు మండల కేంద్రంలో నిర్వ హించిన భూ భారతి భూమి హ క్కుల చట్టం- 2025) పై నిర్వ హిం చిన అవగాహన సదస్సుకు ము ఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ తంలో ఉన్న ధరణి చట్టంలో అనే క సమస్యలను రైతులు, అధికారు లు ఎదుర్కొన్నారని, అయితే వాట న్నిటిని తొలగించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని రా ష్ట్ర ప్రభుత్వం అందరితో ఆలోచిం చి భూ భారతి చట్టాన్ని తెచ్చిందని చెప్పారు. భూ భారతి చట్టం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, అసైన్డ్ భూముల రెగ్యులరైజేషన్, సాదాబైనామాల సమస్యల పరి ష్కారం, సరిహద్దుల వివాదాల పరి ష్కారం ,మ్యుటేషన్, రిజిస్ట్రేషన్, తదితర అన్ని సమస్యలకు పరి ష్కారం ఇస్తుందన్నారు.
అసైన్మెంట్ భూములన్నింటిని భూ భారతిలో రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉందని, అయితే ఈ వె సులుబాటు ధరణిలో లేకుండేదని, రైతులు అసైన్మెంట్ ద్వారా వచ్చిన భూములను అమ్మడం, కొనడం చేయవద్దని కోరారు. గ్రామస్థాయి లో భూముల సమస్యలు తెలుసు కోవడం, రికార్డుల నిర్వహణ వంటి వాటికోసం గతంలో రెవెన్యూ వ్య వస్థ ఉండేదని, ధరణి వచ్చిన త ర్వాత వీఆర్వో వ్యవస్థను తీసివే యడం జరిగిందని, తిరిగి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భూముల రికార్డు లను సక్రమంగా నిర్వహించడం, వి వాదాలను తగ్గించేందుకు ప్రతి గ్రా మానికి ఒక గ్రామ పాలన అధి కారులను నియమించనుందని, ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పదివేల 590 మంది గ్రామ పాలన అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు.
అలాగే రైతులకు తరచూ వచ్చే సర్వే సమస్యలను పరిష్కరించేం దుకుగాను రాష్ట్రవ్యాప్తంగా 6000 మంది లైసెన్సుడ్ సర్వేయర్లను ని యమించబోతున్నదని, దీని ద్వారా భూములకు సంబంధించిన వివా దాలు ఏర్పడినప్పుడు సర్వే చే యించడమే కాకుండా ,ఆ భూము లకు మ్యాపులను ఏర్పాటు చేసి పట్టా పాస్ పుస్తకంలో వాటిని పొం దుపరిచేందుకు ఒక మంచి అవకా శం ఉందని చెప్పారు.
మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్టుగానే భూములకు సంబంధించిన రికార్డు ఉండే విధంగా భూమి కలిగిన ప్రతి రైతుకు భూదార్ కార్డును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుందని చెప్పారు. ధరణి పోర్టల్ లో అనుభవదారు కాలం లేదని, భూ భారతిలో అను భవ దారుకే ప్రాధాన్యత ఉంటుంద ని అన్నారు. భూ భారతి చట్టంలో అధికారులు తప్పు చేస్తే ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించబ డతారని, తిరిగి ఎలాంటి ఉద్యోగా నికి తీసుకోవడం జరగదని హెచ్చ రించారు. అయితే భూమి కబ్జాలో ఉన్నంత మాత్రాన రైతుకు హక్కు రాదని,ఫ్లో చార్ట్ తో పాటు, అన్ని రకాల డాక్యుమెంట్లు, రికార్డు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం భూభారతి చట్టాన్ని ప్రతిష్టా త్మకంగా తీసుకువచ్చిందని, గత చట్టం ధరణిలో ఆప్పీలు చేసుకునే అవకాశం లేదని ,కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, అలాంటి తప్పులన్నింటి నీ సరిచేస్తూ కొత్త చట్టాన్ని తీసు కొచ్చిందన్నారు. నల్గొండ ప్రాంతం లో భూముల కోసం పోరాటం చేసి న సంఘటనలు ఉన్నాయని, భూ దాన్ భూములు, దేవాదాయ భూ ములు, అసైన్డ్ భూములు, అన్ని రకాల భూములు నల్గొండలో ఉ న్నాయని, భూములు ఎక్కువగా ఉన్నచోట సమస్యలు కూడా ఎక్కు వగా ఉంటాయని, అయితే భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టాన్ని రైతులు, ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని కోరారు.
మునుగోడు ప్రాంతం ఫ్లోరైడ్ పీ డిత ప్రాంతంగా ఉన్నందున వా గులే ఆధారంగా ఉన్నాయని, అ యితే ఈ మధ్యకాలంలో వాగులు సైతం ఆక్రమణలకు గురవుతున్నా యని, వాటిని సంరక్షించే చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశా రు. అలాగే మునుగోడు అత్యంత వెనుకబడిన ప్రాంతమని, ప్రాజెక్టు లను తీసుకొచ్చి పూర్తిచేయాల్సిన అవసరం ఉందని, ఇందిరమ్మ ఇం డ్లతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథ కాలలో మునుగోడు ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ధరణి మహా మ్మారి బారి నుండి రైతులను బ యటపడవేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం భూ భారతి చట్టాన్ని తీసుకొ చ్చిందని, దీన్ని సద్వినియోగం చే సుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్ డి ఓ శ్రీదేవి మాట్లాడుతూ భూ భారతి చట్టం లోని వివిధ విభాగాలు ,వాటి ప్రాధాన్యతలను తెలియజేశారు. తహసిల్దార్ నరే ష్, డిప్యూటీ తహసిల్దార్ నరేందర్ భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. మార్కెట్ కమిటీ చైర్మ న్ నారాయణ, ఎంపీడీవో శాంతకు మారి, తదితరులు ఈ అవగాహన సదస్సు కు హాజరయ్యారు.