— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nalgonda District Collector Tripathi :ప్రజా దీవెన, దేవరకొండ : రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా దేవరకొండ రెవిన్యూ డివిజన్ పరి ధిలోని చింతపల్లి మండల కేంద్రం లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తెలంగాణ భూ భారతి చట్టం (భూ మి హక్కుల రికార్డు చట్టం)-2025 పై ఏర్పా టు చేసిన అవగాహన స దస్సుకు హాజరయ్యారు.
రైతులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల కోసం, ప్రత్యే కించి రైతులకు వారి భూముల పై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభు త్వం భూభారతి చట్టాన్ని తీసుకొ చ్చిందని తెలిపారు. ధరణి పోర్టల్ లో లేని అనేక సమస్యలకు పరి ష్కారం భూభారతి చట్టం ద్వారా దొరుకుతుందని, జూన్ 2 నుండి ఆన్లైన్లో భూభారతి చట్టం పోర్టల్ పనిచేస్తుందన్నారు.
భూములకు సంబంధించిన సమ స్యలపై రైతు లు మీ -సేవలో లాగే దరఖాస్తు చేసుకోవచ్చని, ఏదైనా సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేస్తే నిర్దేశించిన సమయంలో పరి ష్కరించడం జరుగుతుందని, ఒక వేళ పరిష్కరించలేకపోతే చాలాన్ ద్వారా చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించడం జరుగుతుందని వెల్ల డించారు.
ధరణిలో వ్యవసాయ సబ్ డివిజన్ పై ఎలాంటి ప్రస్తావన లేదని , భూ భారతి చట్టంలో సబ్ డివిజన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నా రు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 న భూభారతి చట్టంలోని నిబంధన ల ప్రకారంరికార్డులను అప్డేట్ చేయ డం జరుగుతుందన్నారు. రైతులు ఇకపై బ్యాంకు రుణాలకు వెళ్ళిన ప్పుడు భూములకు సంబంధించిన కాగితాలను సమర్పించాల్సిన అవ సరం లేదని, భూభారతి పోర్టల్ లో నమోదైన రికార్డుల ఆధారంగానే బ్యాంకు రుణాలు ఇస్తారని తెలిపా రు.
భూభారతి చట్టంలోని ముఖ్యమైన అంశాలను ఆమె వివరిస్తూ భూభా రఠీ చట్టంలో మ్యుటేషన్లు ఆటోమే టిక్ గా అవుతాయని ,30 రోజుల్లో మ్యుటేషన్ కాకపోతే 31వ రోజు ఆటోమెటిగ్గా మ్యుటేషన్ జరుగు తుందన్నారు. రిజిస్ట్రేషన్ మ్యుటే షన్, సాదా బైనామాకు సంబంధిం చిన వివరాలు అన్నింటిని రైతులు ఇతర రైతులతో పంచుకోవాలని, చట్టంపై అందరికీ పెద్ద ఎత్తున అవ గాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
భూభారతి చట్టంలోని అంశాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆర్డిఓ కార్యాలయా ల్లో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇక్కడ ఫిర్యాదులను సమర్పించి పరిష్క రించుకోవచ్చని, ఒకవేళ రైతులకు ఎవరికైనా న్యాయసహాయం అవస రమైతే ఉచిత న్యాయ సహాయాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుం దని కలెక్టర్ తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా భూములకు సంబం ధించిన అవినీతిని అరికట్టి, రెవె న్యూ శాఖను బలోపేతం చేయడా నికి ఉపయోగపడుతుందన్నారు.
సదస్సుకు ముఖ్య అతిథిగా హా జరైన దేవరకొండ శాసనసభ్యు లు బాలు నాయక్ మాట్లాడుతూ భూ వివాదాలు లేని నియోజకవర్గంగా దేవరకొండ నియోజకవర్గాన్ని తీర్చి దిద్దేందుకు భూ భారతి చట్టం ఉప యోగపడుతుందన్నారు. తమ ప్ర భుత్వం 100 సంవత్సరాలు చెప్పు కునేలా ఒక గొప్ప చట్టాన్ని తీసుకొ చ్చిందన్నారు. రైతులకు మేలు జరి గేలా ,భూ వివాదాలు లేని చట్టంగా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువ చ్చిందన్నారు.
భూములకు సంబంధించిన అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వా రా పరిష్కారం దొరికిందని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణిలో ఇలాంటి ఆకాశము లేదని, ధరణి వల్ల అనేక సమస్యలు వచ్చాయని అన్నారు. భూభారతి చట్టం వల్ల రైతులకు, పేదలకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. ఎంతో మంది మేధావులు, అధికారులు భూభారతి చట్టానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నాలు గు జిల్లాలలోని నాలుగు మండలా లలో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రవేశ పెట్టిన తర్వాత చట్టాన్ని తీసుకురా వడం జరిగిందని, జూన్ 2 నుండి భూభారతి పోర్టల్ అమల్లోకి వస్తుం దన్నారు .అంతేకాక ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన గ్రామ పరిపాలన రెవెన్యూ వ్యవస్థను తిరి గి బలోపేతం చేసే విధంగా పదివేల మంది గ్రామ పాలనా అధికారుల ను నియమించనున్నామని, దీని ద్వారా రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడం జరుగుతుందని చెప్పా రు .
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన, సన్న బియ్యం పంపిణీ ,వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అమలు చేస్తున్న దని,, వీటన్నిటిని వినియో గించు కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ భూభారతి చట్టంలోని సెక్షన్లు, వా టి వివరాలపై రైతులకు అవగా హన కల్పించారు .గతంలో ధర ణిలో రికార్డుల నిర్వహణ లేదని, ఇప్పుడు రికార్డుల నిర్వహణ ఉం టుందని, భూమి కలిగిన ప్రతి రైతుకు ఆధార్ కార్డు లాగే భూధార్ కార్డు ఇవ్వడం జరుగుతుందని, గ తంలో ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే అ ప్పిల్ వ్యవస్థ లేదని, ఇప్పుడు మూ డంచెల అప్పీల్ వ్యవస్థ ఉందని, ప్రతి అంశం భూ భారతి పోర్టల్ ఉంటుందని, ఎ వరైనా వారి భూములకు సంబం ధించిన వివరాలను పరి శీలించు కోవచ్చని తెలిపారు.
దేవరకొండ ఆడిషనల్ ఎస్పీ మౌ నిక, దేవరకొండ డిఓ రమణా రెడ్డి, తహసిల్దార్ రామకాంత్ శర్మ లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అలివే లు, మాజీ శాసనస భ్యులు యాద గిరిరావు తదితరులు పాల్గొన్నారు.