— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nalgonda District Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: రబీ ధా న్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు సం పూర్ణ సహకారం అందించాలని జి ల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యా లయ సమావేశ మందిరంలో రబీ ధాన్యం కొనుగోలు పై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
రైస్ మిల్లర్ల సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు సానుకూలతతో ఉంటుందని, ముఖ్యంగా పెండింగ్ ట్రాన్స్ పోర్ట్ బిల్లుల చెల్లింపు, పాత గన్ని బ్యాగుల సమస్య ,ఎఫ్ సి ఐ , 67% ఈల్డింగ్ వంటి సమస్యలన్నిటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఇందులో భాగంగా గడిచిన అక్టోబర్ నుండి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ట్రాన్స్ పోర్ట్ బిల్లుల చెల్లింపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1400 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. తక్కిన బిల్లులను ప్రభుత్వం దశలవారీగా చెల్లిస్తోందని అప్పటివరకు వేచి ఉండాలని కోరారు. పాత గన్ని బ్యాగులకు సంబంధించిన సమస్యను పరిష్కరిస్తామని, ఇందుకుగాను రైస్ మిల్లుల వారిగా పాతగన్నీ బ్యాగుల సమాచారాన్ని సేకరించాలని ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల ఆధికారిని ఆదేశించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్టర్ లను సరిగా నిర్వహించాలని ,మిర్యాలగూడ ప్రాంతంలో వెంటనే కొనుగోళ్లు,ఆన్ లోడ్ ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం వచ్చినప్పుడు టెక్నికల్ పర్సన్ తో పాటు, హమాలీలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. జిల్లా యంత్రాంగం తరఫున రైస్ మిల్లర్లకు పూర్తి సహకారం అందిస్తామని, అదేవిధంగా మిల్లర్లు సైతం వ్యవహరించాలని, ఎఫ్ సి ఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎవరిని ఉపేక్షించమని చెప్పారు. ధాన్యం కొనుగోలులో గత ఖరీఫ్ సీజన్లో జరిగిన చిన్న చిన్న లోపాలన్నింటిని అధిగమించడం జరుగుతుందని తెలిపారు.
అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఖరీఫ్ లో లాగే రబీలో సైతం సహకారం అందించాలని, ఏలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా ధాన్యాన్ని దించుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ,2022- 23 ఆక్షన్ ధాన్యం, ఫిలిప్పీన్స్ కు చెల్లించాల్సిన ధాన్యం డెలివరీ కచ్చితంగా ఇవ్వడం ,ధాన్యం వాహనాలను తక్షణమే ఆన్ లోడ్ చేసుకుని వెంటనే పంపడం వంటివి చెయ్యాలని అన్నారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారా యణ అమిత్ మాట్లాడుతూ గత సీజన్లో ధాన్యం కొనుగోలు జిల్లాలో బాగా జరిగాయని, ఈసారి అదేవిధంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావా లని, మిల్లర్లు అన్ని రకాల ధాన్యా న్ని దించుకోవాలని కోరారు. పౌరస రఫరాల జిల్లా మేనే జర్ మరియు ఇన్చార్జి డిఎస్ఓ హరీష్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి మాట్లాడారు.
అంతకు ముందు జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నా రాయణ, భద్రాద్రి, మిర్యాల గూడ, చిట్యాల, హాలి యా, నల్గొండ, దేవరకొండ, తది తర ప్రాంతాల రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభు త్వం కోరినట్లుగా అన్ని రైస్ మిల్లులు బ్యాంకు గ్యారంటీని దాదాపు ఇచ్చాయని, గన్ని బ్యా గుల సమస్యను తీర్చాలని, పెండింగ్ ట్రాన్స్:పోర్ట్ చార్జీలు చెల్లించాలని, టెండర్ ధాన్యం, తదితర విషయాలలో సహక రించాలని కోరారు.