— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nalgonda District Collector Tripathi : ప్రజా దీవెన పెద్దవూర:విద్యార్థినిలు ఉన్నతలక్ష్యసాధన కు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా, పెద్దవూర లోని గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మి కంగా తనిఖీ చేశారు.
విద్యార్థినిలతో కలెక్టర్ ముఖా ముఖి మాట్లాడారు. భోజనం ఎలా ఉందని ఎలా చదువుకుంటు న్నా రని ప్రశ్నించారు. బాగా చదువుకో వాలని చెప్పారు. ఐఐటి అంటే ఏమిటి క్రిటికల్ కేర్ యూనిట్ జాకెట్ తదితర పదాలకు స్పెల్లింగ్ లను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక కాకతీయ సామ్రాజ్యం, ఇతర సామ్రాజ్యాలు, మహాలక్ష్మి దేవత, గురించి అడిగి వారి తెలి వితేటలను పరిశీలించారు.
ఐఐటీ సాధించేందుకు లెక్కల్లో పర్ఫెక్ట్ గా ఉండాలన్నారు. ఐఐటి చదివే విద్యార్థులకు నల్గొండలో ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తానని, ఎంత మందికి కోచింగ్ కావాలో పేర్లు ఇవ్వాలని అడిగారు. ఎంత మంది డాక్టర్ కావాలనుకుంటు న్నారని డాక్టర్ కావాలంటే ఏం చదవాలని అడిగారు. నల్గొండ లో అండర్ గ్రాడ్యుయేషన్ నీట్ కు ఐదు సంస్థలు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని ,అంతేకాక ఇటీవలే నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ ను ప్రారంభించడం జరిగిందని, 40000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ క్రిటికల్ కేర్ యూనిట్ ద్వారా రహదారి ప్రమాదాలు ,ఇతర సమయాలలో అత్యవసర సమయాల్లో వైద్యం అవసరమైన వారికి వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఇవన్నీ ప్రిపేర్ అయ్యేవారికి బాగా పనికొస్తుందని చెప్పారు.
విద్యార్థినిలు బాగా చదివి తల్లి దండ్రులకు, గురువులకు, సమాజా నికి మంచి పేరు తీసుకురావాలని, కలెక్టర్ స్థాయిని మించి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యసాధన కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారా యణ అమిత్, గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి రాజ్ కు మార్, స్థానిక తహసిల్దార్ శ్రీనివా స్ ,ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ తదితరులు ఉన్నారు.