District Collector Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ హెచ్చరిక, అ నర్హులకు ఇందిరమ్మ ఇండ్లను కేటా యిస్తే ఉద్యోగం నుండి తొలగిస్తాo
నల్లగొండ జిల్లా కలెక్టర్ హెచ్చరిక, అ నర్హులకు ఇందిరమ్మ ఇండ్లను కేటా యిస్తే ఉద్యోగం నుండి తొలగిస్తాo
District Collector Tripathi: ప్రజా దీవెన నల్లగొండ: అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తే ప్ర భుత్వ ఉద్యోగం నుండి తొలగిస్తా మని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హె చ్చరించారు.శుక్రవారం ఆమె నల్గొం డ జిల్లా గుండ్లపల్లి (డిండి) మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాల యంలో ఇందిరమ్మ ఇండ్ల పై గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.ఆయా గ్రామ పం చాయతీల వారిగా నిర్వహించిన స మీక్ష సందర్బంగా కలెక్టర్ మా ట్లా డారు.
జాబితాలో ఎవరైనా అనర్హులు ఉ న్నట్లయితే అందుకు బాధ్యులైన వారిని అవసరం అయితే ప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగిస్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల అ ర్హుల జాబితా తయారీలో గ్రామ పం చాయతీ కార్యదర్శులు సీరియస్ గా తీసుకోవాలని,అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే ఇం దిరమ్మ ఇండ్లకు సిఫారసు చేయాల న్నారు. ఎల్ 3 నుండి ఎల్ 1 కు వ చ్చి మంజూరైన ఇండ్లను తక్షణమే గ్రౌండ్ చేయాలని ఆదేశించారు.
డిండి మండలంలో ఎల్ 3 జాబితా పై మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీ లించి కొత్త జాబితాను రూపొందిం చి సమర్పించాలని ఆదేశించారు. ఎ క్కడైనా ఇల్లు మంజూరై కట్టుకునేం దుకు ఆర్థిక పరిస్థితి బాగాలేని మ హిళలకు స్వయం సహాయక మ హిళ సంఘాల నుండి రుణమిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని గృ హనిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ ను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అలాంటి వారి జాబితాను తక్షణ మే సమర్పించాల్సిందిగా ఆదేశిం చారు.
ఇల్లు మంజూరైనప్పటికి నిర్మించు కునేందుకు ఇష్టం లేనివారి నుండి స్పష్టంగా ధ్రువీకరణ తీసుకోవాలని చెప్పారు. దేవరకొండ ఆర్ డిఓ ర మణారెడ్డి, గృహని ర్మాణ శాఖ పీఠి రాజ్ కుమార్, మండల ప్రత్యేకాధి కారి మరియు డిటి డబ్ల్యుఓ చత్రు నాయక్ , తహసిల్దా ర్ శ్రీనివాస్ గౌ డ్, ఎంపీడీవో వెంకన్నఈ సమీక్షకు హాజరయ్యారు.