DSP Shivaram Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: జీవితాలను సర్వనాశనం చేసే గంజాయి మహ మ్మారిని సమాజం నుంచి పారద్రో లెందుకు నల్లగొండ పోలీసు కృత నిశ్చయంతో పాటు పడుతుందని నల్లగొండ సబ్ డివిజనల్ పోలీస్ అ ధికారి శివరాం రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ టౌన్ పోలీస్ స్టేషన్ పరిది లో మెరుపు దాడులలో గంజాయి సేవిస్తూ, విక్రయిస్తున్న పట్టు బడిన 10 మంది యువకులను రెండు వే ర్వేరు కేసులలో అరెస్ట్ చేసి రిమాం డ్ కు తరలించినట్లు ఆయన తెలి పారు. సుమారు రూ. 30 వేలు వి లువ చేసే 1.65 కిలోల గంజాయి స్వాదీనం చేసుకున్నామన్నారు.
గంజాయి సేవిస్తున్న, అమ్ముచున్న నలుగురి రిమాండ్, జైలుకు తర లించినట్లు,గంజాయి సేవించిన 6 గురికి రిహాబిటేషన్ సెంటర్ కు తర లించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిం దన్నారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్ర భుత్వం ప్రతిష్టాత్మికంగా తీసుకొన్న మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగ ౦గా, ఆస్తి సంబందిత నేరాలను అ రికట్టుటలో మరియు చేధించుటలో భాగంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు న ల్గొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి ఆద్వ ర్యంలో మునుగోడ్ రోడ్ లో గంజా యి సేవిస్తూ, అమ్ముచున్న నలుగు రిని, మిర్యాలగూడ రోడ్డులో జూబ్లీ హీల్స్ కాలనీ సమీపమున గంజా యి సేవిస్తున్న ఆరుగురిని పట్టుబడి చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పా రు.
సదరు కేసును నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజ శేఖర్ రెడ్డి ఆ ద్వర్యంలో నల్గొండ 1 టౌన్ యస్ ఐలు జె. గోపాల్ రావు, కె. సతీష్, సిబ్బంది ASI వెంకటయ్య, ఏ ఎస్ ఐ వెంకటేశ్వర్లు, రబ్బాని, శకీల్, శ్రీకాంత్, శంకర్, ఆంజనేయులు, ర మాదేవి, మహేశ్వరి, సైదులు, శ్రీని వాస్ లను జిల్లా ఎస్పీ అభినందిం చారన్నారు. అక్రమ గంజాయి, మా దకద్రవ్యాలు సరఫరా చేసినా, అ మ్మినా, ఎవరైనా వినియోగించినా ఉపేక్షించేది లేదన్నారు. కాగా తల్లి తండ్రులు, కాలనీ పెద్దలు పోలీసు లను సమాచారము ఇవ్వాలని, వా రి వివరాలు గోప్యంగా ఉంచుతా మని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశా ల మేరకు మాద కద్రవ్య వినియో గంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉక్కుపా దంతో అణిచివేస్తామని, ఎంతటి వారినైనా ఉపేక్షించమని, యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని, గంజాయి, సరఫరా, అమ్మే వ్యక్తుల పైనే కాకుండా, సేవించే, వినియోగించే వ్యక్తుల పైన కూడా చట్ట పరమైన కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు.
గంజాయి, మాదక ద్రవ్యాలు విక్ర యాల గురించి గాని, సేవించే వ్య క్తుల గురించి, ఏ రూపంలోనైనా మాదకద్రవ్యాలను సరఫరా చేసేవా రి గురించి మీకు సమాచారం తెలిసి న వెంటనే, డయల్ 100 మరియు డయల్ 8712670141 ద్వారా లే దా నేరుగా మా పోలీసు సిబ్బందికి లకు తెలియజేయవచ్చన్నారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గో ప్యంగా ఉంచబడతాయి. మాదక ద్రవ్యాల నివారణలో ప్రజలు, పోలీ సు వారికి సహకరించి, మాదకద్ర వ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిది ద్దడంలో అందరూ పాలుపంచు కోవాలని కోరారు.