–రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
–మున్సిపాలిటీలో నూతన జనరేటర్, జెసిబి, రోబోటిక్ జట్టింగ్ మిషన్లను ప్రారంభించిన మంత్రి
Nalgonda model municipality : ప్రజాదీవెన నల్గొండ : నల్గొండ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.శుక్రవారం నల్గొండ మున్సిపాలిటీలో 15వ ఫైనాన్స్, మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ.106.10 లక్షలతో నూతనంగా కొనుగోలు చేసి ఏర్పాటు చేసిన జనరేటర్, జెసిబి, ల్యాడర్ ను, అదేవిధంగా పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ క్లినిక్ కు సంబంధించి వెల్స్ ఫార్గో అందజేసిన రోబోటిక్ జట్టింగ్ మిషన్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ప్రతి వార్డును అభివృద్ధి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు, తాగునీటి సమస్య లేకుండా అన్ని అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. నల్గొండ మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత మున్సిపాలిటీ అధికారులను మంత్రి ఆదేశించారు. వార్డులలో ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపాలిటీ పబ్లిక్ హెల్త్ ఎస్ఇ వెంకటేశ్వర్లు, ఈఈ మేడి రాములు, ఏఈ వగ్గే ప్రవీణ్ భార్గవ్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సమద్, ఆలకుంట్ల మోహన్ బాబు, కేసాని వేణుగోపాల్ రెడ్డి, గడిగ శ్రీనివాస్, బొజ్జ శంకర్, శ్రీనివాస్ , ఆమీర్ , మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.