రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత
ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్లగొండ పట్టణంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాను సారం నల్లగొండ డి.ఎస్.పి కె శివరాం రెడ్డి సూచనల మేరకు, పట్టణంలోని డీఈఓ ఆఫీస్ జంక్షన్ వద్ద శ్రీ చైత న్య స్కూల్ విద్యార్థుల తో మానవహారం నిర్వహించి అవ గాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వన్టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని కార్య క్రమాన్ని ఉద్దేశించి, రోడ్డు భద్రత నియమాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తప్పనిస రిగా లైసెన్స్, వాహనానికి సంబం ధించిన డాక్యుమెంట్లు కలిగి ఉండాలని, ఎట్టి పరిస్థితులలోనూ తాగి వాహ నం నడపరాలని సూచించారు.
కేవలం అవగాహన లోపంతోనే చిన్న పాటి నిర్లక్ష్యాలతోనే రోడ్డు ప్ర మాదాలు ఎక్కువ నమోదు అవుతూ ఎంతోమంది క్షత్రగాత్రులు అ వుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కుటుంబ సభ్యులకు తీర ని శోకాన్ని మిగు లుస్తున్నారు.కావున ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఎ లాం టి నిర్లక్ష్యాలకి తావు లేకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని కోరారు.
అలాగే విద్యార్థినీ విద్యార్థులతో మానవ హారం జంక్షన్ వద్ద నిర్వహి స్తూ, రోడ్డు భద్రత నియమాలను స్లొగన్స్ రూపంలో ఇస్తూ, నియమా లను పాటించని వారికి పూలు అందిస్తూ, ఇంటి వద్ద మాలాంటి పి ల్లలు మీకోసం ఎదురు చూస్తున్నారని రోడ్డు ప్రమాదాలకు గురి కావ ద్దని అవగాహన కల్పిం చారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ సైదులు, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శోభన్, ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ మూర్తి, ఎఎస్ఐ, సిబ్బంది మధుసూదన్ రెడ్డి, ఇర్ఫాన్, సతీష్ , నర సింహ సైదులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Nalgonda police