ర్యాగింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు
— నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రోహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ (Prohibition of Ragging Act) ప్రకారం ర్యాగింగ్ కి పాల్ప డితే చ ర్యలు తప్పవని నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి (shiva ramreddy) అన్నారు. వారం రోజుల క్రితం నల్గొండ మెడికల్ కాలేజ్ హాస్టల్ (Nalgonda Medical College Hostel) లో సీనియర్లు జూనియర్ల ను ర్యాగింగ్ చేస్తూ, భౌతిక దాడికి పాల్పడ్డా రని తెలిపారు.
ఆ మేరకు కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ ( principal) రామచంద్రు ఫిర్యా దు మేరకు నలగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బిఎ న్ఎస్ సెక్షన్స్ తో పాటు ర్యాగింగ్ యాక్ట్ (Ragging act) కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగిందన్నారు.
సదరు దాడికి పాల్పడిన వారిని విచారించి వారిపై కఠిన చర్యలు తీ సుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (sh arath chandra pa war) ఆదేశానుసారం, మెడికల్ కాలేజీ లో యాంటీ రాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పారు.
విద్యార్థినీ, విద్యార్థులకు పోలీసుల విజ్ఞప్తి…. చదువుకునే కాలేజీ లలో హాస్టల్లో ఇలాంటి సంఘ టనలు జరిగితే వెంటనే పోలీసులకు, డయల్ 100 కి కాల్ చేసి తెలియజేయాలని సూచించారు.ఎవరైనా ర్యాగింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోబడతాయని, జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు. ర్యాగింగ్ భూతాన్ని సమిష్టిగా( Collectively, the raging demon) ప్రతి ఒక్క రు విద్యా ర్థిని విద్యార్థులు, లెక్చరర్స్ మరి యు పోలీసులతో కలిసి పారదో లాలని ఆకాంక్షించారు.
Nalgonda police dsp