Nalgonda Slbc tunnel project : 20 నెలల్లో ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు పూర్తి
-- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
20 నెలల్లో ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు పూర్తి
— డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ప్రజా దీవెన, హుజూర్ నగర్: రాష్ట్రంలో గత 10 ఏళ్ల పాలనలో బిఆర్ఎస్ నేతలు సంక్షేమ విద్యా ర్థుల మెస్ చార్జీలకు ఒక్క రూపా యి పెంచకుండానే రూ. 7 లక్షల కోట్ల అప్పులు మాత్రం చేశారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మ ల్లు భట్టి విక్రమార్క( mallu batti vikramarka) ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల కోసమే కోరి కొట్లాడి తెలంగాణ తెచ్చుకు న్నామని గుర్తు చేశారు.
పది సంవ త్సరాల్లో గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగంలో( slbc tunnel) ఒక్క కిలోమీటర్లు తవ్వ లేదని, వచ్చే 20 నెలల్లో ఎస్ ఎల్బీసీ సొరంగం ప్రాజె క్టు పూర్తి చే స్తామని హామీ ఇచ్చారు. భారత దేశంలో ఎక్కడా లేని విధంగా యం గ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ రెసి డెన్షి యల్ స్కూల్స్ ని ర్మాణం చేపడుతున్నామని చెప్పారు.
మన విద్యా ర్థులు ప్రపంచ స్థాయి లో పోటీప డేలా ఇంటిగ్రేటె డ్ స్కూ ల్స్ లో వసతులు కల్పిస్తు న్నామని, గత ప్రభుత్వం గత ఏడా ది రెసిడెన్షియల్ పాఠశాలలకు ( recidencial schools) రూ. 70 కోట్లు కేటాయించిందని, కానీ మా ప్రభు త్వం ఒకే ఏడాది రూ. 5 వేల కోట్లు కేటాయించి నిరుపేద పిల్లలపై మాకు ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నామని పేర్కొన్నారు.
ప్రగతిశీల భావాలతో ముందుకు పోవాలి, అద్భుతమైన తెలంగాణ ను ఆవిష్కరించుకోవా లని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( cm revanth reddy) తో పాటు యావ త్ మంత్రిమండలి రోజుకు 18 గంటల పాటు పని చేస్తున్నామని తెలిపారు. ఈ రాష్ట్ర సంపద ప్రజల కు ఉపయోగపడాలి పాలకులు పం చుకోవడానికి కాదని ఎద్దేవా చేశారు. ఆదివారం సూర్యా పేట జిల్లా హుజూర్నగర్ నియోజ కవర్గంలోని గడ్డిపల్లిలో యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షి యల్ స్కూల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం డిప్యూటీ సీఎం స్థానికం గా ఏర్పా టు చేసిన సభలో ప్రసంగించారు.
ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే కోరి కొట్లాడి తెలంగాణ తెచ్చుకు న్నామని గుర్తు చేశారు. అలాంటి రాష్ట్రంలో గత పాలకులు పదేళ్ల పాటు ఈ వర్గాలను పూర్తిగా నిర్ల క్ష్యం చేశారని వివరించారు. 2007 తర్వాత నిరుపేద విద్యార్థు లు ( poor stud ents) చదువుకునే సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షి యల్ పాఠ శాలలో మెస్, కాస్మో టిక్ ఛార్జీలు ( mess charges) ఒక్క రూపా యి కూడా పెంచలేదని అన్నారు.
బడుగు బలహీన వర్గాల సంక్షేమ మే ధ్యేయంగా పనిచేసే ఇందిరమ్మ ప్రభుత్వం దీపావళి పండుగ రోజు 7.50 లక్షల మంది నిరుపేద విద్యార్థులు చదువుకునే సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షి యల్ పాఠశాలల్లో మెస్, కాస్మో టిక్స్ చార్జీలు ఒక్కసారిగా 40 శాతం పెం చుతూ నిర్ణయం తీసుకుందామని ఆ మేరకు ఆదేశాలు విడుదల చేశామని తెలిపారు.
మూడు నుంచి ఏడవ తరగతి వరకు చదువు కునే విద్యార్థుల మెస్ చార్జీలు 950 నుంచి 1330కి పెంచామని, 8 నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల మెస్ చార్జీలు 1100 ఉండగా వాటిని 1540కి పెంచామని తెలి పారు. ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యార్థు ల మెస్ చార్జీలు 1500 ఉండగా 2100 పెంచామన్నారు.విద్యార్థుల పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకొని ఇచ్చే కాస్మోటిక్ చార్జీలు పదేళ్ల పాల నలో ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఏడు లక్షల కోట్ల అప్పు చేసి తగుదునమ్మా అంటూ మా ప్రభుత్వం పై విమర్శలు చేస్తు న్నారని తెలిపారు.
నేటి మన బిడ్డలే రేపటి పౌరులు వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు 8వ తరగతి నుంచి పదవ తరగతి వర కు ఉన్న కాస్మోటిక్ చార్జీలు 55 నుంచి 175 కు పెంచామన్నారు. మూడవ తరగతి నుంచి ఏడ వ తరగతి వరకు ఉన్న కాస్మోటిక్ చార్జీలు 75 నుంచి 150 కి పెంచా మన్నారు. 8వ తరగతి నుంచి పద వ తరగతి వరకు విద్యార్థినిల అవ సరాలను దృష్టిలో పెట్టుకొని వారి కాస్మోటిక్స్ చార్జీలను 62 రూపా యల నుంచి 200 పెంచామన్నారు.
పేద బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభు త్వం ఎంత ఖర్చైనా భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. భారతదేశం లో ఎక్కడ లేని విధంగా నిర్మిస్తు న్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షియల్ పాఠశాల ( intig rated residencial) భవన నిర్మాణ భూ మి పూజలో పాల్గొన డం ఈరోజు విద్యారంగానికి చారిత్రాత్మకం ( historical) అని అభివర్ణించారు.
నాలుగో తరగ తి నుంచి 12వ తరగతి వరకు అన్ని వర్గాల విద్యా ర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ అందరూ ఒకే చోట చదు వుకునేలా అద్భుతంగా నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ పాఠ శాలలో అద్భుత క్రీడా ప్రాంగణాలు, ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన, మన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా 25 ఎక రాల ఆహ్లాదకర వాతావరణంలో సకల సౌకర్యాలతో నిర్మిస్తున్నా మని వివరించారు.
విద్యాబుద్ధులు నేర్పే ఉ పాధ్యాయులు కూడా ఈ పాఠశాల ప్రాంగ ణంలో ఉండేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నా మన్నారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి యావ త్ మంత్రిమండలి ఆలోచించి ఇం టర్నే షనల్ స్కూల్స్ డిజైన్లు ఇచ్చే ప్రపంచ స్థాయి ఆర్కిటెక్ట్ కు బాధ్య త లు అప్పగించామని ప్రతి నియో జకవర్గంలో యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తామన్నారు. ప్రధానంగా విద్య, వైద్యం పై దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభు త్వం ముందుకు పోతుందని తెలి పారు.
పాఠశాలలు పెట్టడమే కాదు వాటికి నిధులు కేటాయించి అద్భు తంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. గత ప్రభుత్వం గత ఏడాది రేజిం చల్ పాఠశాలలకు రూ. 70 కోట్లు మాత్రమే కేటాయించింది, కానీ మా ప్రభుత్వం ఇదే రంగానికి ఒకే ఏడా దిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం ఐదు వేల కోట్లు కేటాయిం చాం అంటే పేద పిల్లల భవిష్యత్తు పై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో మీ అందరూ గమనించాలని అన్నారు.
ప్రతి పైసా పోగు చేసి ప్రజల కోసం ఖర్చు పెడతాం సంపద సృ ష్టి స్తాం, పేదలకు పంచుతాం పేదల కోసం కష్టపడతామని తెలి పారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటిగ్రే టెడ్ పాఠశాలలు ప్రారంభించేలా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ( yada dhri power station) ఎక్కడి పనులు అక్కడే నిలిచి ఉండగా మేము అధికారంలోకి రాగానే పర్యావరణ అనుమతులు సాధిం చామని తెలిపారు. ఏడాది లో మూడు సార్లు పర్యటించి రెం డు యూ నిట్లు సింక్రనైజ్ చేశామని తెలిపారు.
ఎస్ ఎల్ బి సి సొ రం గం ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కూ ర్చుని పూర్తి చేయిస్తామని, నల్లగొం డ జిల్లాను సస్యశ్యామలం చేస్తామ ని చెప్పిన గత పాలకులు పదేళ్ల కాలంలో ఒక్క కిలోమీటర్ సొరం గం తొవ్వకం పూర్తి చేయలేదని విమర్శించారు. మొత్తం 42 కిలో మీటర్ల సొరంగ మార్గం కాగా 32 కిలోమీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో నే తవ్వితే మిగిలిన 10 కిలోమీటర్లలో ఒక్క కిలోమీటర్ కూడా పదే ళ్లు పాలించిన టిఆ ర్ఎస్ పాలకులు పూర్తి చేయలేదని విమ ర్శించా రు.
మేం అధికారంలోకి రాగానే ఎస్ఎల్బీసీ దగ్గర సమీక్ష సమావేశం పెట్టి ప్రతి నెల ఎంత పని జరిగితే అంత మొత్తానికి వెను వెంటనే నిధులు మంజూరు చేస్తా మని చెప్పాం, 20 నెలల్లో ఎస్ఎ ల్బీసీ సొరంగం పూర్తి చేసేందుకు ప్రణాళికలు( plonning) సిద్ధం చేశామని తెలి పారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలి సి తాను ఎస్ ఎల్ పి సి దగ్గర సమీక్ష చేసిన విష యాన్ని గుర్తు చేశా రు.
Nalgonda Slbc tunnel project