Nalgonda SP Sharat Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, కల్తీ మద్యం గుట్టరట్టు భారీ ఎత్తున స్పిరిట్ స్వాధీనం
— నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్
Nalgonda SP Sharat Chandra Pawar : ప్రజాదీవెన నల్గొండ : అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుండి సుమారు 25 లక్షల విలువ గల 600 లీటర్ల స్పిరిట్, 660 లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం చండూర్ మండల కేంద్రానికి చెందిన మహ్మద్ జానీ పాషా గతంలో హైదరాబాద్ లోని చైతన్య పురి లో మటన్ షాపులో పనిచేసేవాడు. అదే సమయంలో అక్కడికి తుర్క యంజాల్ కి చెందిన శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. అతని దగ్గర 2016 లో రెండు సంవత్సరాల వరకు డ్రైవర్ గా పని చేసే క్రమంలో అతని బామ్మర్ది అయినా బెంగుళూర్ కు చెందిన శ్రీనివాస్ గౌడ్ తో పరిచయం ఏర్పడింది. అతను కర్నాటక రాష్ట్రం నుండి ముడి సరుకు తెచ్చి హైదరాబాద్ శివారు లో నకిలీ మద్యం తయారు చేస్తుండడంతో 2019 వ సంవత్సరంలోనే పలు కేసులు నమోదు అయ్యాయి. గత ఆరు నెలల క్రితం కర్ణాటక కు చెందిన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి జానీకి ఫోన్ చేసి రానున్న ఎలక్షన్లలో మద్యం ఎక్కువ సేల్ అవుతుంది. కావున స్థానికంగా ఏదైనా అనువైన ప్రదేశం చూపిస్తే నకిలీ మద్యం తయారు చేసి ఇస్తానని చెప్పాడు. నెరస్థుల వద్ద నుండి ముందస్తుగా 5 లక్షలు ఇస్తే 10 లక్షలు విలువ గల మద్యం తయారు చేసి ఇస్తానని చెప్పాడు. దీంతో జానీ పరిచయస్తుడు అయిన ఎర్రజల్ల రమేష్, చండూర్ కి చెందిన దోమలపల్లి యాదగిరి అలియాస్ మంగలి గిరిలు కలిసి ఈ విషయని తెలిపి నాంపల్లి మండలం గానుగల్లిలో ఉన్న రమేశ్ (కోళ్ళ ఫారం) దగ్గర తోటలో పెడదామని నిర్ణయించుకున్నారు. జానీ, రమేష్ , యదగిరి లు కర్ణాటక కు చెందిన శ్రీనివాస్ గౌడ్ తో మాట్లాడి ఈ సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారంలో 5 డ్రమ్ముల స్పిరిట్ తీసుకువచ్చి రమేష్ తోటలో పెట్టారు. మగ్గురు కలిసి ఎర్రజల రమేష్, మంగళి యాదగిరి తలా 2 లక్షలు వేసుకొని మొత్తం 6 లక్షల రూపాయలు శ్రీనివాస్ గౌడ్ కి ఇచ్చారు. కర్ణాటక చెందిన శ్రీనివాస్ గౌడ్ వచ్చి రాగానే నెరస్తులను వెంటనే ఒక 10 లీటర్ల సామర్థ్యం కలిగిన 40 బిస్లెరి వాటర్ బాటిల్స్ తీసుకురమ్మని తెలుపగా నెల రోజుల క్రితం వారు 40 దాకా బిస్లరీ వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి రెండు స్పిరిట్ డ్రమ్ములలో సదరు శ్రీనివాస్ గౌడ్ తెచ్చిన మూడు రకాల ఫ్లేవర్లను ఒకటి, మూడు లీటర్ల బాటిల్లలో తెచ్చి అందులో కలిపి దాదాపు రెండు డ్రమ్ముల కల్తీ మద్యని తయారు చేశారు.
సుమారు 20 లీటర్ల పరిమాణం గల 40 బబుల్స్ లలో నింపి రెండు, మూడు రోజులు పులియ బెట్టి ఆ తర్వాత ఒక్కొక్క బబుల్ ని 10 వేల రూపాయలకి అమ్మమని చెప్పాడు. అలా ముగ్గురు కలిసి మునుగోడ్ లో గల వైన్ షాప్ లో పార్టనర్ అయిన జాల వెంకటేష్ ని కలిశారు. మద్యం సరఫరా చేస్తాము అంటే అతను ప్యాకింగ్ సరిగా లేదు ప్యాకింగ్ సరిగ్గా ఉంటే తీసుకుంటానని చెప్పాడు. తర్వాత రమేశ్ వాళ్ల అత్తగారి ఊరు అయిన జి. యడవెల్లి గ్రామంలో రమేశ్ కి పరిచయం ఉన్న బొమ్మరబోయిన భార్గవ్ ను సంప్రదించగా అతడు 10 వేల రూపాయలు ఇచ్చి 20 లీటర్ల బబుల్స్ 4 తీసుకున్నాడు. అతనికి తెలిసిన బెల్ట్ షాప్ నిర్వహకులని మద్యం సరఫరా చేస్తా అని అడిగితే వారు కూడా నిరాకరించారు. జానీ పాషా డ్రైవరు అయిన సాయం ఉపేంద్ర కు కూడా డబ్బులు ఇస్తామని మద్యం ని ఆటొ లో చెప్పిన ప్రాంతానికి చేరవేయాలని చెప్పారు. ఈ విదంగా కల్తీ మద్యం తయారుచేసి ప్రజలకు సరఫరా చేసే క్రమలో వారిని పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. కల్తీ మద్యం ప్రజలు తాగినట్లయితే ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున వారి పై నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వివరించారు. అదే విధంగా చండూరు మండలం దుబ్బగూడెం గ్రామంలో ఒక గుడిసెలో నెరస్తులకు సంబంధించిన 20 బాబూల్స్ 400 లీటర్ల కల్తి మద్యాన్ని స్వాధీన పర్చుకొని చండూర్ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నేరస్తులను పట్టుకోవడములో దేవరకొండ ఏఎస్పి పి. మౌనిక, టాస్క్ ఫోర్స్ సీఐ ఏ. రమేశ్ బాబు, ఎస్సై లు మహేందర్, శివ ప్రసాద్ లు నాంపల్లి సర్కిల్ సిఐ రాజు, అదేవిధంగా నాంపల్లి ఎస్సై ఎం. శోభన్ బాబు, నాంపల్లి పోలీసు స్టేషన్ సిబ్బంది, ఎక్సైజ్ పోలీస్ లను జిల్లా ఎస్పి ప్రత్యేకముగా అభినంధిచినారు.