
Nalgonda SP Sharath Chandra Pawar: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి కోట్లా ది రూపాయల నష్టం కలిగించిన ఇద్దరు నింది తులను అరె స్టు చేసిన నల్లగొండ పోలీసులు అరెస్టు చేసి నట్లు నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రభుత్వానికి చెం దిన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి సు మారు రూ. 43 కోట్ల మేర నష్టం కలిగించిన ప్రధాన నింది తులను కందుకూ రు మ హేందర్ ను నల్లగొండ పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు . ఈ కేసును (Telangana State Civil Suppl ies Corporation Limit ed (TGS C SCL) నల్గొండ జిల్లా మేనేజర్ రాoపతి ఫిర్యాదు మేరకు న మోదు చేయడం జరి గిందన్నారు.
ఈ కేసును నల్లగొండ డీఎస్పీ కె.శివ రాంరెడ్డి పర్యవేక్షణలో మూడు ప్ర త్యేక బృందాలు విచారణ చేపట్టడ o ద్వారా ఈ నెల 25వ తేదీన ఉద యం నల్గొండ మండలంలోని దోమ ల పల్లి గ్రామ శివారులో నిందితుల ను అదుపులోకి తీసు కు న్నారన్నా రు.నల్లగొండ సబ్ డివిజన్ పోలీ సులు అరెస్టు చే సిన నిందితుల్లో కందుకూరి మహేందర్ (65), కందు కూరి పద్మ (57)లు ఉండగా మాశె ట్టి రాధాకృష్ణ, మేడo కృష్ణ మూర్తి, ఇడుకుళ్ళ దామోదర్, కందుకూరి రవి కుమార్, బూరుగు బాలకృష్ణ లు పరారీలో ఉన్నారని తెలిపారు.
అరెస్టు చేసిన వారి నుంచి నగదు రూ.లక్షా 9వేలు, మూడు సెల్ ఫో న్లు, బెలెనో కారు నం. TG-07-A- 99 స్వాధీన పర చుకోగా పైనింది తులు 2022-23 రబీ సీజన్‌లో నిందితులు నల్గొండ జిల్లాతో పా టు పరిసర ప్రాంతాలలోని ఆర్జాల బావి సుమాంజలి పార్ బాయిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, చిట్యాల వర లక్ష్మిపార్ బాయిల్డ్ మిల్, మునుగో డు మనోహర ఆగ్రో ఫుడ్ ప్రాడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లు ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ ఒప్పందం కుదు ర్చుకున్నారు.వీరిలో కందుకూరి మహేందర్ ప్రధాన పాత్రధారిగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఏజెంట్/మర్చం ట్‌గా రైతుల నుండి కనీస మద్దతు ధర (MSP) కింద IKP /PACS/DAO/NDCMS/FPOల ద్వారా కొనుగోలు చేసిన ప్యాడీకి సరిపడా బియ్యాన్ని ప్రభుత్వానికి అందించకుండా, కుట్రపూరితంగా ధాన్యాన్ని అక్రమంగా విక్రయించా రన్నారు.
ఈ మూడు రైస్ మిల్లుల ద్వారా మొత్తం 13,170.061 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని అక్ర మం గా విక్రయించి సుమారు రూ.43 కో ట్ల నష్టం కలిగించినట్లు విచారణలో వెల్లడైందని, వీటిలో సుమాం జలి మిల్ సుమారు రూ.22 కోట్లు, వరలక్ష్మి మిల్ సుమారు రూ.19 .33 కోట్లు, మనో హర మిల్ సుమా రు రూ.1.47 కోట్ల నష్టం ఈ కేసులో నిం దితులు నేరపూరిత నమ్మక ద్రోహానికి పాల్పడి ప్రభుత్వ ఖ జానాకు గండికొట్టినట్లు విచారణలో వీరిపై నల్గొండ రూరల్, చిట్యాల, మునుగోడు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు చేసి రిమాండు కి పంపమైనదని, పరారీలో ఉన్న నిం దితుల కోసం గాలింపు చర్యలు కొ నసాగుతున్నాయన్నారు.ఈ కేసును నల్లగొండ డిఎస్పీ శివ రాం రెడ్డిపర్యవేక్షణలో ద ర్యా ప్తులో పాల్గొన్న నల్గొండ II టౌన్ CI రాఘ వరావు, నార్క ట్ పల్లి సీఐ నాగరా జు,నల్గొండ రూరల్ ఎస్. ఐ సైదా బాబు సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినం దించా రు.
బియ్యం కుంభకోణం కథాకమీషూ..
రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ప్రభుత్వకు అందించా ల్సిన బియ్యం కుంభకోణం నల్ల గొండ రైస్ మిల్లుల కేంద్ర బిందుగా నిలిచాయి. ఉమ్మడి నల్లగొండ జి ల్లాలో 2022-23 సంవత్సరానికి సంబంధించి పౌరసరఫరాల శాఖ మిల్లర్లకు భారీగా ధాన్యం కేటా యించింది. కాగా చిట్యాల వర లక్ష్మి పారాబాయిల్డ్, కేతేపల్లి చా ముండేశ్వరి, మునుగోడు ము రళీ మనోహర్, నల్లగొండలోని రామల క్ష్మణ్, కనక మహా లక్ష్మి, సుమాంజ లి, గౌతమి ఇండస్ట్రీస్ సైతం సీఎం ఆర్‌గా మార్చి ఇస్తామని కొనుగోలు కేంద్రాల నుంచి పెద్ద ఎత్తున ధాన్యా న్ని తీసుకున్నాయి. ఇక్కడే అంతా పక్కా పధకం ప్రకారం తిరిగి ఇవ్వా ల్సిన సీఎంఆర్ బియ్యం ఎగ్గొట్టా రు. దాదాపు ఏడు మిల్లులు మొ త్తం 58,955 మెట్రిక్ టన్నుల ధా న్యం వ్యూహాత్మకoగా సదరు ధా న్యం విలువ అక్షరాల రూ. 193 కో ట్లకు పైమాటే కావడం విశేషం.
ఇదిలా ఉండగా గత ఏడాది ప్రభు త్వం ఈ ధాన్యాన్ని వేలం వేస్తే కొ నుగోలుదారులు వెళ్ళి చూసే సరికి దిమ్మతిరిగి కళ్ళు బైర్లుకమ్మాయి. మిల్లుల్లో ధాన్యం మాయo కావడమే ఇందు కు నిదర్శనం. ఈ క్రమం లో మిల్లర్ల మాయాజాలం కాస్తా వి షయం బట్టబయలై అధికారగణం నివ్వెరపోవాల్సిన వం తైంది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మర పట్టిం చిన రైస్ మిల్లర్లు సదరు బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా పక్కదారిపట్టించి బహిరంగ మార్కె ట్ కు తరలించి సొమ్ము చేసుకు న్నారన్న వాస్తవాలు అధికారుల క్షేత్రస్థాయి విచా ర ణలో తేట తెల్లమైంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా మిల్లర్ల కు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) అందివచ్చిన అదృష్టంగా పరిణ మించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా కు ఇదేం కొత్త వ్యవహారం కాక పో గా ప్రతి ఏడాది ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకోవడం దాన్ని మరప ట్టించి బహిరంగ మార్కెట్ కు తర లించి సొమ్ము చేసుకోవడం పరిపా టిగా మారిందన్నది బహిరంగ రహ స్యమే. మరికొం తమంది మి ల్లర్లు పక్క రా ష్ట్రాల నుంచి ధాన్యాన్ని తక్కువ ధరకు తీసు కొచ్చి ప్రభుత్వానికి ఎ క్కువ ధరకు అప్పగించిన దాఖలా లు చెపుదగ్గవే. అయితే రూ.193 కోట్ల స్కామ్ చేసి న ఏడు మిల్లుల యాజమాన్యాలు మూడేండ్లుగా పక్కా ప్లా న్‌తో సీఎంఆర్ ఎగవేతకు ప్లాన్ వేశారన్న ఆరోపణలు నేడు వాస్తవాలుగా అధికారులు, పోలీ సుల విచారణలో నిలిచా యి.
సిఎంఆర్ ఎగవేతతో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపా రా లు…
ఇదిలా ఉంటే అయితే ఈ మిల్లర్ల వెనుక రాజకీయ నేతల అండదం డలు ఉండడం గమనార్హం. పొలిటి కల్ లీడర్లకు బినామీలుగా మారి రూ.193 కోట్లను మాయం చేయ గా సదరు నగదుతో హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ల వ్యాపారo, షేర్ లలో పెట్టుబడులు పెట్టడం సిని మాల్లో పెట్టుబడులు పెట్టడం, స్థిరాస్థులను మార్టిగేజ్ చేసుకుని అధిక వడ్డీలకు తిప్పడం, ఇతరేతర మా ర్గాల్లో పెద్ద ఎత్తున లాభ నష్టాలు చవిచూశారని ఈ తరు ణంలో విశ్వవ్యాప్త ప్రచారానికి దారిపడింది. వ్యాపారాల్లో లాభాలు గడిoచినా ప్రభుత్వానికి బాకీపడిన మొత్తం లో చిల్లిగవ్వ చెల్లించేందుకు కూడా వీరికి మనసు రాలేదన్న చీ..త్కారాలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా ఎట్టకేలకు వీరి వద్ద నుంచి పైసా వసూలు చేసేందుకు సన్నద్ధ మైన ప్రభుత్వం రంగం సిద్ధం చేసు కొని వేట ప్రారం భించింది. ఈ క్రమంలో ఈ మొత్తం ఎపిసోడ్ పై నా న్‌బెయి లబుల్ కేసులు పెట్టామని అధికారులు చెబుతునప్పటికీ సి ఎంఆర్ ను వెనక్కి రాబట్టేందుకు అధికారులు ఏ మార్గంలో ముందు కెళ్తారన్న మీమాంస అందరిలోనూ నెలకొంది. రెవె న్యూ రికవరీ యాక్ట్ ద్వారా సిఎంఆర్ ప్రభుత్వానికి రాబడు తారా లేదా అన్న అనుమా నాలకు ఆస్కారం లేకపోలేదు. ప్ర భుత్వ సొమ్ము అంటే అందరికీ అలసిపోతుందని వాదన లేకపో లేదు.
సిఎంఆర్ కేసులు నల్లగొండకే పరిమితమా….తాజాగా నల్లగొండ జిల్లాలో సిఎంఆర్ ఎగవేత కు సంబంధించి కేసు లు నమోదు, అరెస్టులు ఇక్కడికే పరిమితమా అన్న వాదన తెరమీదకొచ్చింది. నల్లగొండ జిల్లాలో లెక్కకొచ్చిన రూ. 193 కోట్ల కు పక్కను పాత ఉమ్మడి నల్లగొండ లోని సూర్యా పేట, భువనగిరి జిల్లాలతో పాటు రా ష్ట్రంలోని ఆయా జిల్లాల్లో నల్ల గొండ జిల్లాకు రెండింతలు, మూ డింతలు సిఎంఆర్ ఎగవేత గణాం కాలు ఉన్నాయని, మరి వాటి సం గతేమి టన్న ప్రశ్నల బాణాలు ప్ర భుత్వానికి ఎక్కుపెడుతున్నారు. అయితే తేనెతుట్టే ఇప్పుడే లేచి నందున పక్క జిల్లాలతో పాటు ఆ యా జిల్లాలకు కూడా పాకనుంద న్న బహిరంగ చర్చ ప్రారంభమైంది. అయితే ప్రభుత్వం, అధికారయం త్రాం గం ఏమేరకు స్పందిస్తుందో వేచిచూడాల్సి ఉంది. మొ త్తాని కి ఇంతకాలం స్తబ్దుగా ఉన్న సిఎం ఆ ర్ కుంభ కోణం వ్యవ హారం ఎట్టకేల కు తెర మీదకొచ్చి చర్యలకు ఉపక్ర మిం చ డంతో హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి.




