Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgondacollectertripathi : రబీ ధాన్యం సేకరణకు యంత్రాంగం సర్వం సన్నద్ధం

జిల్లాలో ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దు  --అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి చేయాలి --- నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

రబీ ధాన్యం సేకరణకు యంత్రాంగం సర్వం సన్నద్ధం

జిల్లాలో ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దు 

–అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి చేయాలి
— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Nalgondacollectertripathi:   ప్రజా దీవెన నల్లగొండ బ్యూరో: నల్ల గొండ జిల్లాలో 2024 -25 రబీ ధా న్యం మార్కెట్ కు రానున్న నేప థ్యంలో రబీ ధాన్యం సేకరణకు పౌ రసరఫరాలు, వ్యవసాయ అను బంధ శాఖలు సంసిద్ధం కావా లని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశిం చారు.ఈ రబీ లో వరి పంట కు కేంద్ర ,రాష్ట్ర ప్రభు త్వాలు గ్రేడ్ ఏ రకా నికి 2320/- రూపాయలు, సాధా రణ రకానికి 2,300/- రూపాయల మద్దతు ధరను ప్రకటించాయని, అంతే కాకుండా సన్నధాన్యానికి ప్రో త్సాహకంగా క్వింటాల్ కు 500 /-రూపాయలు బోనస్ ప్రకటించడం జరిగిందని తెలిపారు.

రబీ ధాన్యం సేకరణ, మద్దతు ధర పై దాన్యం కొనుగోలు కేంద్రాల ఇ న్చార్జి లకు ఉద్దేశించి శనివారం ఉదయా దిత్య భవన్ లో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సంవత్సరం రబీలో జిల్లా వ్యా ప్తంగా 2 లక్షల 5 వేల హెక్టార్లు సాగయ్యిందని, 12 లక్షల 14449 మెట్రిక్ టన్నుల వరి ధా న్యం జిల్లా లో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు.

మార్కెట్ కు 11 లక్షల 26021 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకా శం ఉన్నట్లు అంచనా వేయడం జరిగిందని, ఇందులో మిల్లర్లు 5,6 8,152 మెట్రిక్ ట న్నులు ,సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ద్వారా 5,5 7,869 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కార్యా చ రణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఖరీఫ్ లో 2 లక్షల 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చే యడం జరిగిందని, ఇందులో 2,10,000 మెట్రిక్ టన్నులు దొడ్డు ధాన్యం, 74,3 టన్నులు సన్న ధా న్యాన్ని కొన్నట్లు తెలిపారు. కాగా గత రబీలో జిల్లాలో 3 లక్షల 7018 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగో లు చేయడం జరిగిందని పేర్కొ న్నారు.

ఈ రబీ లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకుగాను జిల్లా వ్యాప్తం గా 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, ఇందులో 304 కేంద్రాలు దొడ్డు ధాన్యం కొనుగోలుకు, 71 కేంద్రాలు సన్నధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేస్తామని, మార్కెట్ కు వచ్చే ధాన్యం ఆధారంగా కొనుగో లు కేంద్రాలను పెంచడం జరుగు తుంద ని కలెక్టర్ స్పష్టం చేశారు.

రబీ ధాన్యం కొనుగోలుకు కోటి 39 లక్షల 46,725 గన్ని బ్యాగులు అవ సరం అవుతాయని కలెక్టర్ తెలిపారు.గత ఖరీఫ్ ధాన్యం కొను గోలులో గుర్తించిన లోపాలన్నింటిని రబీ ధాన్యం సేకరణ సందర్భం గా సరిచేసుకోవాలని ఆమె చెప్పారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌ రస రఫరాలు ,డిఆర్డిఏ, తూనికలు కొలతలు ,అన్ని శాఖల అధికారు లు, సిబ్బంది ఎవరి పని వారు నిర్వర్తించాలని, ఎక్కడ తప్పులకు అవకాశం ఇవ్వకూడదని, ధాన్యం కొనుగోలులో ఏవైనా తప్పులు చేసిన, లేదా అందుబాటులో లేకున్నా ఇబ్బందులు సృష్టించిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

వ్యవసాయ శాఖ అధికారులతో పాటు, సంబం ధిత శాఖల సిబ్బంది ఎల్లప్పుడూ దాన్యం కొనుగోలు కేంద్రాలలో సి ద్ధంగా ఉండాలని, ధా న్యం కొనుగో లు కేంద్రాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవా లని, రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా అవగాహన కల్పిం చాలని ఆదేశించారు. ఏదైనా ధా న్యం కొనుగోలు కేంద్రంలో అవకత వకలు జరిగినట్లు లే దా నిర్లక్ష్యం వహించినట్లు తెలిస్తే ఆ సెంటర్ ను తీసివేయడం జరు గుతుందని హె చ్చరించారు. ధాన్యం కొనుగోలుతో పాటు, అన్ని శాఖ ల అధికారులు ధాన్యం కొను గోలు కు సంబంధించిన వివరాల న్నిం టిని ఒకేలా ఇవ్వా ల్సిన అవసరం ఉందని చెప్పారు.

ధాన్యం కొనుగోలు కై అన్ని కేంద్రాల వద్ద కాలిపర్స్ తో పాటు, ధాన్యం శుభ్రపరిచే యంత్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ధా న్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి పత్రికలలో వచ్చే వార్తలకు సంబం ధిత కొనుగోలు కేంద్రం ఇంచార్జిలే వివరణ ఇవ్వాల్సి ఉంటుం దని , ధాన్యం కొనుగోలుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించా ల్సిం దిగా ఆమె విజ్ఞప్తి చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అన్ని ధా న్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఓ ఆర్ ఎస్ పాకెట్లతో పాటు, మందు లు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశిం చారు.

అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని తూర్పార బట్టే యం త్రా లు, అలాగే గన్ని బ్యాగులు, క్యా లిపర్లు ,తూకం కొలిచే యంత్రా లు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు తర్వాత వెంటనే ఓపిఎంఎస్ ఎంట్రీ చేయాలని, ధా న్యం కొనుగోలు చేసే సమ యంలో నే రైతుల నుండి పాస్ బుక్ ,ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కు సంబం ధించిన వివరాలన్నిటిని తీసుకోవా లన్నారు. రైతులు ధాన్యం తేమ శాతం 17 శాతానికి మించకుండా ఉండే విధంగా కొనుగోలు కేంద్రా లకు తెచ్చేలా అవగాహన కల్పించాలని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాలకు సరఫ రా చేసినందుకు 14117 టార్పాలి న్లను అందుబాటులో ఉంచడం జరిగిందని, 2 00 క్యాలిపర్లు, 253 తూకం కొలిచే యంత్రాలు ఉన్నాయని , జి ల్లాలో 146 రైస్ మిల్లులు ఉండగా ,6.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే సామ ర్థ్యం ఈ రైస్ మిల్లులకు ఉందని వెల్లడించారు.ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐదుగురు సిబ్బంది తో పాటు, అవ సరమైన ఫ్లెక్సీ బ్యానర్, ధాన్యం కొనుగోలుకు సం బంధించిన ప్రచార సామాగ్రి, హామాలి అన్నింటిని సిద్ధం చేసుకోవా లని తెలిపారు. ఇత ర రాష్ట్రాల నుండి జిల్లాకు ధాన్యం రాకుండా చెక్ పోస్ట్ ల ఏర్పాటు తోపాటు, ఇంటర్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు.

ధాన్యం కొ ను గోలుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే రైతు లు , కొనుగోలు కేంద్రం నిర్వాహకులు సంప్రదించేం దుకుగాను గ్రీవెన్స్ సె ల్ ఏర్పాటు చేయడం జరిగింద ని ,ఈ సెల్ లో ఏర్పాటు చేసిన 99 63407 064 నంబర్ కు వారి సమ స్యలను తెలియ జేయవచ్చని ఆమె వెల్లడించారు .రబీ ధాన్యం కొనుగోలు సందర్భం గా ఎలాంటి తప్పు లకు ఆస్కారం ఇవ్వద్దని, ఆయా శాఖల అధికా రులు, సిబ్బంది వారి కి కేటాయించిన తూ.చా తప్పకుండా పాటిం చాలని కోరారు.

ఈ సంద ర్భంగా జిల్లా పారసరఫరాల మేనేజర్ హరీష్, జిల్లా వ్య వసాయ అధికా రి శ్రవణ్, డిసిఓ పత్య నాయక్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా మార్కె టింగ్ అధికారి ఛాయాదేవి, ఆర్టీ వో, లీగల్ మెట్రాలజీ అధికారులు తదితరులు వారి శాఖల ద్వారా నిర్వర్తించే విధులపై వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రబీ ధాన్యం మద్దతు ధర, ధాన్యం సేక రణ పై రూపొందించిన గోడ పత్రి కను, కరపత్రా లను విడుదల చేశారు.

ఈ సమావేశానికి జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష , కార్య దర్శులు, ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు,సిబ్బంది, ప్యాడి కాంట్రాక్టర్స్ కె తేజస్విని గౌడ్, కె తరుణ్ గౌడ్, ఎస్ యుగం ధర్ రెడ్డి, జె యాదయ్య యాదవ్, బి వెంకన్న గౌడ్, ఎం వెంకన్న యా దవ్, జి వెంకన్న యాదవ్, పి యా దయ్య గుప్తా, వై అశోక్ రెడ్డి, పి నికే ష్ గుప్తా, ఎండీ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.