Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgondapolice : నల్లగొండలో రౌడీ షీటర్ అరెస్టు

నల్లగొండలో రౌడీ షీటర్ అరెస్టు

— నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి

Nalgondapolice: ప్రజా దీవెన నల్లగొండ క్రైమ్: నల్లగొండ జిల్లా లో గంజాయి మత్తు లో వీరంగం సృష్టించి వర్గ వైషమ్యాలు రెచ్చ గొట్టాలని చూసిన పేరు మోసిన రౌడీషీటర్ ను నల్గొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి జైలు కు పంపించినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి వివరాలు తెలిపారు.

గత కొన్ని సంవత్సరాలుగా నల్ల గొండలో అనేక హత్య కేసులలో ఉన్న నలపరాజు రాజేష్ అలియాస్ మెం టల్ రాజేష్ రౌడియిజం పేరుతో అనేక సెటిల్మెంట్లు చేస్తూ అమా యకులను బెదిరిస్తూ హైదరాబాద్ కేంద్రంగా ఎప్పుడు వెంట పది పది హేను మందితో ఆగడాలు అరాచ కాలు సృష్టిస్తున్నాడు.ఇతడు ఎవరి నైనా టార్గెట్ చేస్తే గంజాయి మత్తు లో ఫోన్లు చేసి బెదిరించడం వారి దగ్గరికి మనుషులని పంపించి చంపేస్తానని నల్గొండలో నేను మిం చిన రౌడీషీటర్ లేరని మెంటల్ రాజేష్ అంటే అందరికీ దడ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడని తెలిపారు.

ఈ క్రమంలో ఇతర మతానికి చెందిన ఒక వ్యక్తికి ఫోన్ చేసి అతనిని చంపేస్తానంటూ అత ని వర్గాన్ని కించపరుస్తూ బెదిరించగా బాధి తుడు ముందుకు వచ్చి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అట్టి కేసు విష యంలో విచారణ గురించి వెళ్లిన పోలీసు లను గంజాయి మత్తులో ప్రతిఘటించి చుట్టూ అతడి అను చరుల ను పోలీసుల మీదకు రెచ్చ గొట్టి బీభత్సం సృష్టించి సింపతి పొందా లని చూశాడన్నారు.

పోలీసుల అరెస్ట్ తో చివరికి కటకటాలపాలయ్యాడు. అతనిని విచా రించగా ఎంతోమంది ల్యాండ్ సంబంధిం చిన సెటిల్మెంట్లు చేసినాడ ని, డ్రగ్స్ పార్టీలు రౌడీల ను వెంట తిప్పుకుం టూ డాన్ గా ఎదగాల ని, అవసర మైతే వినకపోతే నరికి చంపుతా నని వెల్లడించినట్లు తెలిసింది.

అతనిపై దాదాపు 17 కేసులు ఐదు హత్య కేసులు, గంజాయి కేసు లు పీడీ యాక్ట్ లో కూడా పోయినట్లు తెలుస్తుంది అలాగే బాధితులు స్వచ్ఛందంగా ఇతని ఆగడాలకు గురై నట్లయితే ముందుకు వస్తె మరిన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు.