Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NalgondaSP: సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై కఠిన చర్యలన్న ఎస్పీ 

 సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై కఠిన చర్యలన్న ఎస్పీ 

NalgondaSP : ప్రజా దీవెన, నల్లగొండ: కుల,మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పో స్టులు పెడితే కఠిన చర్యలు తప్ప వని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ హెచ్చరిక జారీ చేశారు. రానున్న ఉగా ది, రంజాన్ పండుగ సందర్భం గా కుల,మత విద్వేషాలను రెచ్చ గొట్టే విధంగా సోషల్ మీడియా వేది కగా పోస్టులు పెట్టే వారిపై నిరంత రం సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షిస్తూన్నమని జిల్లా ఎస్పి శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

ఎవరైన సామాజిక మాధ్యమాల్లో వాట్స్ అప్,ఫేస్బుక్,ట్విట్టర్, ఇ న్స్టాగ్రం, యూ ట్యూబ్ తదితర వాటిని వేదికగా చేసుకుని ఇతర కులాల పట్ల ,మతాల పట్ల,వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు, విద్వే ష పూరితమైన పొస్ట్ లు,ద్వేష పూరి త ప్రసంగాలు, రెచ్చ గొట్టే విధం గా పోస్ట్ లు,అసత్య ప్రచారాలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిం చే రీతిలో తప్పుడు పోస్టులు పెడి తే తగిన చర్యలు తప్ప వని హెచ్చ రించారు.

సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, ప్రజలు ఎవ్వరు నమ్మవద్ద ని సూచించారు. సామాజిక మాద్య మాలను వేదికగా చేసుకోని తప్పు డు, విద్వేషకర పోస్టులు చేసిన, షే ర్ చేసిన వారి సమాచారాన్ని సం బంధిత పోలీస్ స్టేషన్ కి తెలియజే యాలన్నారు. సమాచారం అం దించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.