ఎస్పీ పవార్ అప్పీల్, రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి
NalgondaSp: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని పాతబస్తీలో ఉన్న గడి మసీదును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించారు. ముస్లిం మత పెద్దలతో, ప్రార్థన కొరకు వచ్చిన వారితో కొద్దిసేపు మా ట్లాడారు.
రానున్న పండగలను ఉగాది మరి యు రంజాన్ ను జిల్లా ప్రజలంద రూ కలిసిమెలిసి మతసామరస్యం పాటిస్తూ శాంతి యు తంగా జరుపు కోవాలని, దీనికి ప్రతి ఒక్కరు సహ కరించాలని, అలాగే గత కొన్ని సం వత్సరాలుగా నల్గొండ జిల్లా శాంతి సామర స్యాలకు మారుపేరని ఎలాంటి గొడవలకు, అవాంఛనీయ సంఘట నలకు, అసత్య ప్రచారాల కు తావు ఇవ్వడంలేదని గుర్తు చేస్తూ కొన్ని సూచనలు చేయడం జరిగింది.
ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ప్రకటనలు, వార్త లు, వీడియోలు, మెసేజ్లు గుడ్డిగా నమ్మవద్దని లేనిచో సంబం ధిత పోలీస్ స్టేషన్ లలో సమా చా రం ఇవ్వాలని సూచించారు. రానున్న ఐపీఎల్ లో ముఖ్యంగా యువ త బెట్టింగ్లకు పాల్పడుతున్నారని, దాని మూలంగా వారి జీవితాలలో, వారి కుటుంబ జీవితాలలో ఆర్థి కంగా చితికిపోయి విషాదానికి గురి అ వుతున్నారని తెలియ జేశా రు.
ఎట్టి పరిస్థితులలో బెట్టింగ్ యాప్‌ల జో లికి వెళ్లరాదని, ఒకవేళ అలాంటి సమాచారం ఉన్నట్లయితే పోలీస్ 100 నెంబర్ కు గాని, సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 నెంబర్ కి గాని తెలియజే యా లని సూచించారు. అదే విధంగా నల్గొండ పట్ట ణంలో ముఖ్య చౌర స్తాలు బాగా రద్దీగా ఉండే ప్రాంతాలను ఆకస్మి కంగా తనిఖీలు చేశా రు.