ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి
మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 21. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా కార్యకర్తల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని పోరాటాల ద్వారా తెలియపరుస్తామని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి హెచ్చరించారు. శుక్రవారం రోజున నాంపల్లి మండల కేంద్రంలోనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిఐటియు ఆశ వర్కర్ యూనియన్ బస్ యాత్ర జయప్రదం కోసం పోస్టర్ ఆవిష్కరణ చేశారు బిజెపి టిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి నేటికీ పరిష్కారం చేయలేకపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించా.
రు కార్యకర్తలకు 18,000 కనీస వేతనం నిర్ణయించాలని ఉన్నత అధికారులకు ఎమ్మెల్యేలకు మంత్రులకు అనేకసార్లు నిత్పత్రం నిలిచామని తెలిపారు అయినా ఆశా కార్యకర్తల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కారం కోసం 20 24 డిసెంబర్ 15 నుండి 31 వరకు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహిస్తున్నామని ఆశా కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సంఘం మండల శాఖ అధ్యక్షురాలు ఎదుల కవిత, సునీత, కోరే లలిత యాదమ్మ సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.