Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nampally Court: ప్రభాకర్రావును పట్టుకురండి

— ఏ1ను హాజరు పరచాల్సిందే
–ఏ6 శ్రావణ్ రావును తీసుకురండి
–పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదే శం

Nampally Court: ప్రజా దీవెన, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone tapping case) ప్రధాన నిం దితు డిగా ఉన్న ప్రభాకర్ రావును కోర్టు (Prabhakar Rao) లో ప్రత్యక్షంగా హాజరు పర్చాలని నాంపల్లి కోర్టు (Nampally Court)ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై శనివారం నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగింది. విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఈ నెల 26న కోర్టు లో హాజరుపరచాలని నాం పల్లి కోర్టు పోలీసులను ఆదేశించిం ది. నాన్ బెయిలబుల్ వారంట్ (Non-bailable warrant)ఉన్నందున అరెస్టు చేసి తీసుకు రావాలని సూచించింది. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు జుడీషియల్ కస్టడీని ఈ నెల 26 వరకు పొడి గించింది. ఈనేపథ్యంలో ఈ కేసును విచారించిన కోర్టు ఏ-1గా ఉన్న ప్రభాకర్ రావు హాజరు కాకుండా ఎలా విచారణ చేపట్టాలని పోలీ సులను ప్రశ్నించింది. వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా ఏ1ను విచారించ లేమని తేల్చిచెప్పింది.

అలాగే ఫోన్ ట్యాపింగ్ (Phone tapping case)కోసం పరికరాలను కొను గోలు చేసిన మీడియా సంస్థ అధినేత శ్రావణ్ రావు ఆచూకీ కనుక్కొని ప్రత్యక్షంగా హాజరు పర్చాలని ఆదేశించింది. ఫోన్ ట్యా పింగ్ (Phone tapping case)వ్యవహారంలో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు, ఏ6గా ఉన్న శ్రవణ్ రావుపై ఇప్పటికే నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ అయినందున తదు పరి విచారణ నాటికి కోర్టులో హాజ రుపర్చాలని సూచించింది. తన క్లయింట్ అనారోగ్యం కారణంగా అమెరికాలో చికిత్స పొందుతు న్నా రని, వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరవుతారంటూ ప్రభాకర్ రావు తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్రావు, శ్రావణవులు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆ దేశించడంతో సిట్ అధికారులు ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను (Prabhakar Rao and Shravan Rao) పోలీసులు ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సిట్ రెండు బృందాలను ఏర్పాటు చేసి ఒక బృందాన్ని అమెరికా పంపేందుకు సమాలోచనలు సాగిస్తున్నారు. అలాగే శ్రావణవు ఆచూకీ కనిపెట్టడం కోసం మరో బృందాన్ని సైతం పంపనున్నట్లు పోలీసులు చెబుతున్నారు.