Nandi Award : ప్రజా దీవేన, కోదాడ: కోదాడ ప్రాంతానికి చెందిన భక్తి గీతాలు గాయకుడు నూకపంగు గోపాలకృష్ణ కు నంది అవార్డు ఉజ్వల సంస్థ అధ్యక్షురాలు లక్ష్మి బుధవారం ప్రకటించారు.జయ ఇంటర్నేషనల్ హోటల్ ఆబిట్స్ హైదరాబాద్ లో అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సాంఖ్యక శాస్త్రాన్ని పెగ్నలు దైవజ్ఞ శర్మ పాల్గొని గోపాలకృష్ణకు నంది అవార్డు అందజేశారు, వక్తలు మాట్లాడుతూ అవార్డు గ్రహీత పేద కుటుంబంలో జన్మించి కళ ను నమ్ముకుని స్వశక్తితో వందలాది భక్తి, సామాజిక, గీతాలు పాడుతూ గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని అందుకు ఈ సత్కారమని తెలిపారు.
అలాగే అవార్డు గ్రహీత మాట్లాడుతూ ఈ అవార్డుకు ఎంపిక కావటానికి ఎన్నో సంవత్సరాల శ్రమ, కృషి పట్టుదలతో సాధన చేయడం జరిగిందని తెలిపారు నంది అవార్డు అందుకోవటం వలన నాపై మరింత బాధ్యత పెరిగిందని గుర్తు చేశారు ఈ సందర్భంగా పలువురు మిత్రులు బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు .