Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narasimha Rao: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలనలో విఫలమైంది

Narasimha Rao: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)ప్రజా పరిపాలనలో విఫలమైందని టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు నరసింహారావు (Narasimha Rao) అన్నారు ఆదివారం రోజున నాంపల్లిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నా నిర్వహించారు అనంతరం అధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టి పరిస్థితి వచ్చిందని విత్తనాల సమయంలో రైతు భరోసా పొలాలు కోతకు వచ్చిన ఇంతవరకు రైతు భరోసా (Farmer’s Assurance) లేదని బ్రతికింటోలకు 500 బోనస్ లేదని రైతు రుణమాఫీ పూర్తిగా చేయుటలో ప్రభుత్వం విఫలమైనది అన్నారు తక్షణమే ప్రభుత్వం రైతులకు (farmers) క్షమాపణ చెప్పాలని అన్నారు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పూదరి సైదులు బట్టు జగన్ మండల మైనార్టీ సెల్ నాయకులు మహమ్మద్ సలీం ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సపవర్ సర్దార్ నాయక్, కడారి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు