Narasimha Rao: ప్రజా దీవెన,కోదాడ: మిత్రులకు పదోన్నతులు పొందటం ప్రశంసనీయమని సాయి మందిరం చైర్మన్ నల్లపాటి నరసింహారావు (Narasimha Rao)అన్నారు.గురువారంమండల పరిధిలోని రామాపురం ఎక్స్ రోడ్ నందు గల సాయిబాబా మందిరంలో 1980-81 పదవ తరగతి స్నేహితులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఇటీవల పదోన్నతులు పొందిన కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా పని చేస్తున్న పులి వెంకటేశ్వర్లు (Puli Venkateshwar) కు ఎస్సైగా ప్రమోషన్ రావడం, పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మాతంగి ప్రభాకర్ రావు రెండోసారి ఎన్నిక కావడం,మునగాల ఎంఈఓ గా పిడతల వెంకటేశ్వర్లు నూతనంగా బాధ్యతలు చేపట్టినారు ఈ సందర్భంగా వారికి పూలమాల శాలువులతో ఘనంగా సన్మానించారు.
వీరందరూ పదవ తరగతి చిన్ననాటి స్నేహితులుగా తెలిపారు.అనంతరం దాతలు తొండపు రాంబాబు,కుమారుడు హర్షవర్ధన్ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సత్యనారాయణ,మాజీ సర్పంచ్ ముండ్ర రంగారావు,అల్సగాని శరబయ్య,ముండ్ర రమేష్,ముండ్ర శ్రీను,సుబ్బారావు,కనగాల నారాయణ,జూలూరి శ్రీనివాస్,మురళి,సత్తిబాబు,కొల్లి ప్రమీల,పూర్ణయ్య,కోదాటీ మాధవరావు,బాలాజీ దాస్,కృష్ణమూర్తి,బాలాజీ,ఆదినారాయణ,ముండ్ర రవి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.