-కోత విధిస్తే పోరాటాలకు సన్నద్ధం — టియూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్య క్షుడు బీఆర్ లెనిన్
Narayana : ప్రజా దీవెన హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో డెస్క్ జర్నలిస్టుల హ క్కులను గుర్తించి జర్నలిస్టు ఉద్య మ నాయకుడు, తొలి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ డెస్క్ జర్నలిస్టులoదరికీ అక్రిడిటే షన్లు ఇప్పించారని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్న లిస్ట్స్ టియూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్ తెలి పారు. ప్రస్తుత ప్రభుత్వం, మీడి యా అకాడమీ అధికారులు కోత పెట్టేందుకు సిద్ధమైందని, ఒక వేళ అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా పో రాటాలకు సిద్ధమని హెచ్చరించా రు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (H-143) హను మకొండ జిల్లా కమిటీ మొదటి సర్వసభ్య సమావేశం గ్రేటర్ వరం గల్ ప్రెస్ క్లబ్ లో సోమవారం జరి గింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ లెనిన్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల ను అల్లం నారాయణ నేతృత్వం లోని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కడు పులో పెట్టుకుని కాపాడుకుందని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి తడక రాజ్ నారాయణ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థి తుల్లో ఆర్థిక సహాయం అందించి జర్నలిస్టులకు మనోధైర్యాన్ని నిం పిన ఘనత మునియన్ కి దక్కు తుందని అన్నారు.
యూనియన్ బలోపేతం అయితే ప్రెస్ క్లబ్ లను సునాయసంగా గెలుచుకోవచ్చని రాజ్ నారాయణ సూచించారు. అందుకుగాను హన్మకొండ జిల్లా కమిటీ యూనియన్ బలోపేతం కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమో దించారు. ఇకమీదట యూనియన్ హన్మకొండ జిల్లా కమిటీ నిర్మాణా త్మకంగా పనిచేస్తూ సభ్యుల అభి వృద్ధి, సంక్షేమం కోసం పాటుపడు తుందని, హన్మకొండ నగరంతో పాటు మండలాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సాదనే ద్యేయంగా పనిచేస్తామని, అందుకుగాను మంత్రులు, ఎమ్మెల్యేల మీద యూనియన్ పరంగా వత్తిడి పెంచుతామని తెలిపారు. ప్రస్తుత ప్రెస్ క్లబ్ పాలకవర్గం గత ఎన్నికల్లో గెలవడం కోసం అనేక హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని, హామీల అమలు కోసం ప్రెస్ క్లబ్ పాలకవర్గాన్ని నిలదీస్తామని స్పష్టం చేసారు. ప్రెస్ క్లబ్ పాలకవర్గం పదవీ కాలం ముగిసినప్పటికీ మార్చిలో బాధ్యతలు తీసుకున్నాము.ఆరు నెలలు గ్రేస్ పీరియడ్ ఉందని చెబుతున్నారని, ఈ అంశం మీద ఆయా యూనియన్ల సీనియర్ జర్నలిస్టులను సంప్రదించి కార్యా చరణ తీసుకుంటామని స్పష్టం చేసారు. ప్రెస్ క్లబ్ మాజీ అధ్య క్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెరుమాడ్ల వెంకటేశ్వర్లు తో పాటు మరికొందరిపై పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన పిటిషన్ ను ప్రెస్ క్లబ్ కమిటీ వెనిక్కి తీసుకుని, వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసారు.
యూనియన్ నాయకుల మీద అనుచిత వ్యా ఖ్యలు, దూషణలు చేయడమే కాకుండా, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్ట్ లు పెడితే సహించేది లేదని, ఒకవేళ ఏ సభ్యుడైన ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఇకమీదట యూనియన్ లో వ్యక్తి పూజ, నిర్ణయాలు ఉండవని. ప్రతిదీ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ లను సంప్రదించి వారి ఆదేశాల ప్రకారం హన్మకొండ జిల్లా కమిటీ పనిచేస్తుందని ఏకగ్రీ వంగా తీర్మానాలు చేసి ఆమోదిం చారు.
యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మస్కపురి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి అర్షం రాజ్ కుమార్, యూనియన్ కోశాధికారి పొగాకుల ప్రభాకర్ గౌడ్, యూనియన్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు బూరం ప్రశాంత్, తాళ్లపళ్ళి వేణుగోపాల్, వీడియో జర్నలిస్ట్ ప్రధాన కార్యదర్శి సుంచు రామరాజు, ఫోటో జర్నలిస్ట్ ఉమ్మ డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గొట్టే వెంకన్న, సంపేట సుధాకర్, యూనియన్ హన్మకొండ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు దుంపల పవన్, ఆరేల్లి కిరణ్, చింతల సత్యనారాయణ, బి దేవేందర్, గోకారపు శ్యామ్ కుమార్, సిరిమల్లె సదానందం, బుడిగే శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు రాజేందర్, మైదం సుధాకర్, హింగె రాజేశ్వర్ రావు, కర్నాకర్, బండారి సతీష్, బానాల ధన్ రెడ్డి, బొమ్మగాని ఆద ర్శ్, అప్పని సిద్దు, కార్యవర్గ సభ్యు లు పాల్గొన్నారు.