–సబ్ కలెక్టర్ నారాయణ అమిత్
ప్రజా దీవెన, మిర్యాలగూడ: మిర్యాలగూడ మునిసిపాలిటీ సాగర్ రోడ్డులో సర్వేనెంబర్ 992లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను జిల్లా టాస్క్ ఫోర్స్ టీం ఆధ్వర్యంలో కూల్చి చేయడం జరిగిందని సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు .సాగర్ రోడ్డులో మునిసిపాలిటీ అనుమతులు లేకుండా ట్రేడ్ లైసెన్స్ లేకుండా దుకాణాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.
ఈ విషయంపై రెండు నెలల క్రితం మున్సిపాలిటీ నుంచి వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ సర్వే నెంబర్ భూమి 1964లో గ్రామకంఠంగా రికార్డులో ఉందని నిబంధనల ప్రకారమే కూల్చివేశామన్నారు అదేవిధంగా ఈనెల 18న మరోసారి నోటీసులు జారీ చేయడం జరిగిందని మున్సిపల్ చట్టం నిబంధనలకు విరుద్ధంగా దుకాణ సముదాయాన్ని ఏర్పాటు చేయటం వలన అట్టి అక్రమ నిర్మాణాన్ని తొలగించడం జరిగిందని వివరించారు. మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే నిబంధన ప్రకారం తొలగించడం జరుగుతుందని తెలిపారు నిర్మాణాలు చేపట్టే ముందు ఇంటి యజమాని ముందుగా మున్సిపాలిటీ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్ యూసుఫ్ తాసిల్దార్ హరిబాబు తదితరులు ఉన్నారు.