Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: వాతావరణ సమతుల్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి

–మొక్కలు నాటడంతో పాటు సంర క్షణ బాధ్యత చేపట్టాలి
–ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతోనే అభివృద్ధిసాధ్యo
–నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

Narayana Reddy: ప్రజా దీవెన, మిర్యాలగూడ: పరి శ్రమలతో అభివృద్ధి వస్తుందని , అదే సమయంలో అభివృద్ధితో పాటు వాతావరణ సమతుల్యం అవసరమని, ఇందుకోసం ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటా లని జిల్లా కలెక్టర్ సి .నారాయణ రెడ్డి (Narayana Reddy) పిలుపునిచ్చారు.ఆదివారం అయన నల్గొండ జిల్లా మిర్యాల గూడ పట్టణం, అవంతిపురం ఈద్గా వద్ద స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి వనమహోత్స వం కింద మొక్కలు నాటారు. వన మహోత్స వం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటడం (Planting) సంతోషమని కలెక్టర్ అన్నారు. మిర్యాలగూడ లాంటి ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని ,పరిశ్రమల వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుం దని, అయితే పరిశ్రమల వల్ల వాతావరణ కాలుష్యం (Atmospheric pollution) కాకుండా పెద్ద ఎత్తున మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని అన్నారు. స్థానిక శాసనసభ్యులు నియోజకవర్గం లో వనమహోత్సవం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు, స్వ చ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో విరివిగా పాల్గొనడం పట్ల కృతజ్ఞత లు తెలిపారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు (Public representatives ,officials) కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మిర్యాలగూడలో రైస్ మిల్లర్లు ఎక్కువగా ఉన్నందువలన వారు సైతం మొక్కలు నాటే కార్యక్రమం లో భాగస్వాములు కావాలన్నారు. మొక్కలు నాట డంతో పాటు, మొక్కల సంరక్షణ పై ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని , ఉపాధి హామీ పథకం (Employment Guarantee Scheme) కింద 3 సంవత్సరాల వరకు మొక్కలు నాటి సంరక్షించే అవకాశం ఉందని, ఇందుకు వాచర్లను నియమిం చుకోవాలని, అంతేకాక సంరక్షణ బాధ్యతలను సైతం మూడేళ్ల వరకు వారే చూస్తారని తెలిపారు. అధికారులు సైతం మొక్కలు నాటి వాటిని సంరక్షిం చాలని కోరారు.

అన్ని గ్రామ పంచాయతీలలో (Gram Panchayats) నీటి ట్యాంకర్లు ఉన్నందు న వాటిని వినియోగిం చుకోవాల ని ,ఎట్టి పరిస్థితులలో మొక్కలు చనిపో కుండా చర్యలు తీసుకోవాలని కోరారు.స్థానిక శాసనసభ్యు లు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ ప్రాంతంలో పరిశ్ర మలు ఎక్కువగా ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తాము పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇందులో భాగంగా 2500 మొక్క లు నాటుతున్నట్లు ఆయన వెల్లడిం చారు. స్వచ్ఛదానం పచ్చదనం కింద సైతం పెద్ద ఎత్తున మొక్కలు నాటామని వన మహో త్సవంలో మిర్యాలగూడ పట్టణం తోపాటు నియోజకవర్గంలో (Constituency)మొక్కలు నాటు తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొ న్నారు.